టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంగీత దర్శకుడిగా టాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు స్టార్ హీరోల సినిమాలకు సూపర్ హిట్స్ అందించారు. అయితే సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే తమన్.. అప్పట్లో నెగెటివిటీపై చేసిన కామెంట్స్ వైరలైన సంగతి తెలిసిందే. ఆయనను తక్కువ చేస్తూ కొందరు కామెంట్స్ చేయగా.. తనదైన శైలిలో కౌంటరిచ్చారు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ సోషల్‌మీడియా నెగెటివిటీపై మాట్లాడారు. నెటిజన్లు ప్రశంసించినప్పుడు ఎలా తీసుకుంటామో.. విమర్శలు కూడా అలాగే తీసుకోవాలని అన్నారు.
(ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!)
ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు తమన్ బదులిచ్చారు. 'మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ మధ్య మీపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారు. క్రికెట్ మీద పెట్టిన శ్రద్ధ మ్యూజిక్‌పై పెట్టొచ్చుగా అని అంటున్నారు? అని అడిగారు. దీనికి కూడా తమన్ తనదైన శైలిలో స్పందించారు.
తమన్ మాట్లాడుతూ.. 'నాకు ఎలాంటి వ్యసనాలూ లేవు. నాకు గర్ల్‌ఫ్రెండ్స్ కూడా లేరు. నాకు ఉన్న ఒకే ఒక్క ఎమోషన్ క్రికెట్. ప్రతిరోజూ నా ఫ్రెండ్స్‌తో రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకూ క్రికెట్ ఆడి ఇంటికెళ్తా. నా టీమ్ పేరు తమన్ హిట్టర్స్. మా టీమ్‌లో మ్యూజిషియన్స్, డ్యాన్సర్స్ కూడా ఉన్నారు.. ఈ విషయంలో నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల నాపై ఒత్తిడి తగ్గుతుంది.' అని అన్నారు. కాగా.. తమన్ ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రానికి సంగీతమందిస్తున్నారు.
(ఇది చదవండి: ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్!)
Comments
Please login to add a commentAdd a comment