దర్శకుడు రమేశ్ వర్మ పెన్మెత్స
‘‘గత ఏడాది నా పుట్టినరోజుకి ‘రాక్షసుడు’ సినిమా హిట్‌తో ఉన్నా.. ఈ ఏడాది ఏం లేదు. కరోనా పరిస్థితులు లేకపోయుంటే కచ్చితంగా మరో హిట్‌తో ఉండేవాణ్ణి’’ అని దర్శకుడు రమేశ్ వర్మ పెన్మెత్స అన్నారు. ‘ఒక ఊరిలో, రైడ్, వీర, అబ్బాయితో అమ్మాయి, రాక్షసుడు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రమేశ్ వర్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు.
►ఈ లాక్‌డౌన్‌లో ఇంట్లో కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాను. అయితే పని అనేది తప్పని సరి కావడంతో 10 రోజులుగా ఆఫీసుకు వెళుతున్నా. మళ్లీ షూటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్లాన్ చేయాలి కదా. ‘రాక్షసుడు’ సినిమా విడుదల తర్వాత నాకు నాలుగైదు అవకాశాలు వచ్చాయి. కానీ రవితేజగారితో చేయాలనుకోవడంతో ఆగాను. నిర్మాత కోనేరు సత్యనారాయణగారు కూడా తొందరేం లేదు కంఫర్టబుల్‌గా చేద్దామన్నారు.
తమిళ్‌లో హిట్ అయిన ఓ సినిమా రీమేక్ చేద్దామనుకున్నాం. కానీ ఆ కథ కంటే ఇప్పుడు చేయబోయే సినిమా కథ రవితేజగారికి చాలా బాగుందని దీంతో ముందుకు వెళుతున్నాం. సెట్స్‌పైకి వెళ్లేందుకు బౌండెడ్ స్క్రిప్ట్ లాక్ చేసిపెట్టుకున్నాం. ఇంతలో కరోనా వచ్చేసింది. ప్రస్తుతం చిన్న సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి. కానీ పెద్ద చిత్రాలేవీ షూటింగ్స్ ప్రారంభించలేదు. అందరూ మొదలు పెడితే మేం కూడా సిద్ధమే.
►‘రాక్షసుడు’ హిందీ రీమేక్ హక్కులను కోనేరు సత్యనారాయణగారే తీసుకున్నారు. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం వహించాలన్నారాయన. రీమేక్‌లో నటించేందుకు చాలా మంది హీరోలు రెడీగా ఉన్నారు. కానీ మేం ఎవర్నీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. రవితేజగారి సినిమా పూర్తయ్యాక బాలీవుడ్‌లో ‘రాక్షసుడు’ రీమేక్ చేస్తా.
►నిర్మాతగా ‘7’ నా తొలి సినిమా. చిన్న చిత్రంగా తీద్దామనుకున్నాం. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరడంతో పెద్ద సినిమా అయింది.. బడ్జెట్ కూడా పెరిగింది. దీంతో నా స్నేహితులు కూడా ప్రొడక్షన్‌లో భాగమయ్యారు. ఈ చిత్రం వల్ల నష్టంలేదు.. సేఫ్ ప్రాజెక్ట్.. నెట్ ఫ్లిక్స్‌లో ఇప్పటికీ ఆదరణ బాగుంది. ఆ సినిమా హిందీలో చేస్తే బాగుంటుందని నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఓ ప్రతిపాదన కూడా పెట్టారు. భవిష్యత్‌లో సినిమాలు నిర్మించాలా? వద్దా అన్నది నిర్ణయించుకోలేదు.. అవకాశాల్ని బట్టి వెళతా.
Comments
Please login to add a commentAdd a comment