కోనేరు సత్యనారాయణ
‘‘40 ఏళ్లుగా కేఎల్ యూనివర్శిటీలు నడిపిస్తున్నాం. హైదరాబాద్‌లో కొత్త బ్రాంచ్ కూడా ప్రారంభించాం. మా అబ్బాయి హవీష్ చేసిన ‘జీనియస్’కు నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాను. కానీ నిర్మాణంలో ఇన్వాల్వ్ కాలేదు. పూర్తిస్థాయి ప్రొడక్షన్‌లోకి వద్దామనుకొని ‘ఏ స్టూడియోస్’ బ్యానర్ స్థాపించాం’’ అన్నారు కోనేరు సత్యనారాయణ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాక్షసుడు’. కేఎల్‌యు సంస్థల చైర్మన్ కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కోనేరు సత్యనారాయణ చెప్పిన విశేషాలు.
► తమిళంలో ‘రాక్షసన్’ రిలీజ్ అయిన వారంలోనే చూశాను. గ్రిప్పింగ్‌గా ఉంది. మా అబ్బాయితో రీమేక్ చేయాలనుకున్నాను. అప్పటికే మావాడు థ్రిల్లర్ జానర్‌లో ‘7’ సినిమా చేస్తున్నాడు. దాంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బావుంటాడనుకున్నాం. సాయి శ్రీనివాస్ చాలా బాగా చేశాడు.
► ‘ఒరిజినల్‌లో ఉన్నదానికి ఒక్క సీన్ కూడా మార్చకుండా తీయండి’ అని దర్శకుడితో అన్నాను. ఉన్నది ఉన్నట్టు తీయడం కూడా కష్టమే! రమేష్ వర్మ చాలా కష్టపడ్డాడు. సినిమాను ఎలా తీయాలనుకున్నామో అలానే తీశాం.
► నా చిత్రాల్లో మెసేజ్ ఉండాల నుకుంటాను. ‘జీనియస్’లో హీరోలను, క్రికెటర్స్‌ను అభిమానించండి.. ఆరాధిం చొద్దని చెప్పాం. ‘రాక్షసుడు’లో ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాం.
► కాలేజీలో ఒక పని చేయాలంటే చాలామంది ఉంటారు. ఒకరికి చెబితే పని అయిపోతుంది. షూటింగ్‌లోనూ అదే అప్లై చేశాను. సినిమా బిజినెస్ పూర్తయింది. థియేట్రికల్ రైట్స్ అభిషేక్ పిక్చర్స్ వాళ్లకి ఇచ్చేశాం. నెక్ట్స్ 2, 3 సినిమాలు అనుకుంటున్నాం. వాటిలో హవీష్‌తో ఓ సినిమా ఉంటుంది.
► ఎంటర్‌టైన్‌మెంట్ యూనివర్శిటీ స్థాపించాలనుకుంటున్నాను. ఆ యూనివర్శిటీలో సినిమా, టీవీ, యానిమేషన్, గ్రాఫిక్స్ అన్నీ నేర్చుకునేలా ఏర్పాటు చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment