వచ్చే నెల 19న ‘గాడ్’ జన్మదిన వేడుకలు
Published Sat, Dec 24 2016 10:17 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
వెదురుపాక (రాయవరం) :
వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) 81వ జన్మదిన వేడుకలను వచ్చే నెల 19న పీఠంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్‌వో వాడ్రేవు వేణుగోపాల్(బాబీ)లు పీఠంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. వచ్చే నెల 17వ తేదీ ఉదయం 11.05 గంటలకు జ్యోతి ప్రజ్వలన, గోపూజ, లక్షీ్మగణపతి హోమంతో జన్మదిన వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. గాడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భక్తజన సంక్షోభ నివారణార్థం పీఠంలో పలు ఆధ్మాతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. పూజల్లో భాగంగా 17న తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం పండితులతో శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి హోమం, సాయంత్రం ఆరు గంటలకు అన్నవరం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పండితులతో స్వామివారి దివ్యకళ్యాణం, 18 ఉదయం 9 గంటలకు తిరుమల వైఖానస పండితులచే శ్రీదేవి, భూదేవి సమేత విజయ వేంకటేశ్వరస్వామి దివ్యకళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. 19వ తేదీ ఉదయం గాడ్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తారన్నారు. విజయ వేంకటేశ్వరస్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వరసిద్ధి వినాయకుడు, భవానీ శంకరుడు, శ్రీరామచంద్రమూర్తి, శ్రీవిజయదుర్గాదేవి ఉత్సవమూర్తులకు పుష్పయాగం, హారతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జన్మదిన వేడుకలకు బ్రాహ్మణ, అర్చక సంక్షేమ సంఘం ఛైర్మ¯ŒS ఐవైఆర్ కృష్ణారావు, పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మ¯ŒS రావులపాటి సీతారామారావు, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర క్రీడలు, యువజన శాఖల ముఖ్య కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం తదితరులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. 20న శ్రీవారి శాంతికళ్యాణం నిర్వహిస్తామన్నారు. జన్మదిన వేడుకల ఆహ్వాన పత్రికలను పీఠాధిపతి గాడ్ సమక్షంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో విజయదుర్గా పీఠం భక్తజన సంఘం సభ్యుడు గాదె భాస్కరనారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement