John Abraham Birthday Special On His Career: బాలీవుడ్ యాక్టర్, కండల వీరుడు జాన్ అబ్రహం పుట్టినరోజు నేడు. 1972 డిసెంబర్ 17న కేరళలో జన్మించిన జాన్ అబ్రహం తల్లి పార‍్సీ, తండ్రి మలయాళీ. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన జాన్ అబ్రహంకు సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జాన్‌కు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. జాన్ నేటికి (డిసెంబర్ 17) 48 ఏళ్లు. మోడలింగ్ సమయంలో డబ్బు లేకపోవడంతో అతడు కొన్ని రోజులు మీడియా ప్లానర్‌గా పనిచేశాడు. ఈ విషయం అతి తక్కువ మందికి తెలుసు. జాన్ అనేక మ్యూజిక్ వీడియోలు, అడ్వర్టైజ్‌మెంట్స్ చేశాడు. అనంతరం 2003లో 'జిస్మ్' సినిమాతో బాలీవుడ్‌లో అరంగ్రేటం చేశాడు. తర్వాత 'సాయా', 'పాప్' సినిమాల్లో కనిపించాడు.
2004లో వచ్చిన 'ధూమ్' సినిమా జాన్ అబ్రహం సినీ కెరీర్‌ను మలుపుతిప్పింది. అభిషేక్ బచ్చన్ పోలీసు పాత్రలో నటించగా, జాన్ అబ్రహం దొంగ పాత్రలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. తర్వాత పలు సినిమాల్లో విలన్ రోల్స్ చేశాడు. గరం మసాలా, దోస్తానా, వెల్‌కమ్ బ్యాక్, ఫోర్స్-2, అటామిక్, సత్యమేవ జయతే చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇన‍్వెస్ట్‌మెంట్ బ‍్యాంకర్, ఎన్నారై ప్రియా రుంచల్‌ను 2014లో వివాహం చేసుకున్నాడు జాన్ అబ్రహం. అయితే ప్రియా ఒక బ్యాంకర్, సినిమాలను పట్టించుకోదని ఓ ఇంటర్వ్యూలో జాన్ అబ్రహం చెప్పాడు. ఇద్దరూ పూర్తిగా విభిన్న రంగాలకు చెందిన వారైన జాన్ అలవాట్లంటే తనకు చాలా ఇష్టమని ప్రియా చెప్పుకొచ్చేది. జాన్ అబ్రహం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడని మెచ్చుకునేది ప్రియా.
జాన్ అబ్రహంకు బైక్‌లంటే చాలా ఇష్టం. అతని దగ్గర రూ. లక్షల విలువైన ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వాటిలో బీఎండబ్ల్యూ, హోండా సీబీఆర్, అప్రిలియా, యమహా, ఎంవీ అగస్టా, డుకాటీ ఉన్నాయి. జాన్ 48 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ 'ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్' అని నిరూపించాడు. జాన్ ఎలాంటి ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్లు లేవు. అంతేకాకుండా అలాంటి ఏ పార్టీల్లో పాల్గొనడట. జాన్ అబ్రహం జంతు ప్రేమికుడు కూడా. వివిధ సామాజిక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ బీటౌన్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు ఈ హ్యాండ్సమ్ హంక్.
Comments
Please login to add a commentAdd a comment