న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. నేటి(జూలై7)తో 37 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ధోని తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. భారత క్రికెట్ జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో పాలు పంచుకున్న ధోని.. భారత జట్టు తరపును 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు సారథిగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఐసీసీ వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టీ 20, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను గెలిచి ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు. ఈ క‍్రమంలోనే ధోని మెరుపుల్ని ఒకసారి గుర్తు చేసుకుంది.
1. భారత్ తరపున ఆరు వరల్డ్ టీ 20 ఎడిషన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్
2. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్ ధోని. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్(664), రాహుల్ ద‍్రవిడ్(509)లు ఉన్నారు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 9వ ఆటగాడు ధోని.
3. 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 780 ఔట్లలో భాగస్వామ్యమైన ధోని.. ఈ రికార్డు సాధించిన ఓవరాల్ మూడో వికెట్ కీపర్. అతని కంటే ముందు మార్క్ బౌచర్(998), ఆడమ్ గిల్‌క్రిస్ట్(905)లు ఉన్నారు.
4. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్టంపింగ్‌లు వికెట్ కీపర్‌గా ధోని(178) అగ్రస్థానంలో ఉన్నాడు.
5. అంతర్జాతీయ టీ20ల్లో 82 మందిని ఔట్ చేసిన ధోని టాప్‌లో ఉన్నాడు.
6. తొలి టెస్టు, వన్డే సెంచరీలను పాకిస్తాన్‌పై ధోని సాధించగా, ఈ రెండు సందర్బాల్లోనూ 148 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేయడం మరో విశేషం.
7. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అత్యధిక సెంచరీలు చేసిన ఘనత ధోనిది. ఏడో స్థానంలో రెండు శతకాలు నమోదు చేసి ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ధోని ఉన‍్నాడు.
8. వికెట్ కీపర్‌గా ఉండికూడా అత్యధిక సార్లు బౌలింగ్ చేసిన ఘనత ధోని సొంతం. అతని కెరీర్‌లో 9సార్లు బౌలింగ్ చేయగా, తొలి వికెట్‌ను 2009లో వెస్టిండీస్‌పై సాధించాడు.
9. 2007లో ఆఫ్రో-ఆసియా కప్‌లో భాగంగా మహేల జయవర్ధనేతో కలిసి ఆరో వికెట్‌కు ధోని 218 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని సాధించాడు. ఇది వన్డేల్లో ఆరో వికెట్‌కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యం.
10. వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును రెండుసార్లు గెలిచిన ఏకైక క్రికెటర్ ధోని.
11.మూడు ఐసీసీ మేజర్ టోర్నమెంట్లను గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్ (వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ).
12. ప్రతీ ఫార్మాట్లోనూ కనీసం 50 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ఏకైక కెప్టెన్.
13. వన్డే ఫార్మాట్లో కెప్టెన్గా 110 విజయాలు సాధించిన ధోని.. 74 పరాజయాలను ఎదుర్కొన్నాడు. కనీసం 20 వన్డేలకు సారథ్యం వహించిన భారత ఆటగాళ్ల పరంగా చూస్తే గెలుపు-ఓటముల రికార్డులో ధోనినే అత్యుత్తమ గణాంకాలను కల్గి ఉన్నాడు.
14. ఐదు-అంతకంటే ఎక్కువ జట్లు ఆడిన నాలుగు టోర్నమెంట్లను గెలిచిన ఘనత ధోనిది. ఈ ఘనతను సాధించిన కెప్టెన్ల పరంగా చూస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి ధోని సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.
15. ఎనిమిది టెస్టు హోదా కల్గిన దేశాలపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను ధోని సొంతం చేసుకున్నాడు. ఇక్కడ తొమ్మిది టెస్టు హోదా కల్గిన దేశాలపై ద్వైపాక్షిక వన్డే సిరీస్లను గెలిచిన వారిలో కెప్టెన్‌గా రికీ పాంటింగ్ ముందున్నాడు. తొమ్మిది టెస్టు దేశాలపై పాంటింగ్ వన్డే సిరీస్‌లను గెలిచాడు. కాగా, బంగ్లాదేశ్‌పై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను సాధించడంలో ధోని విఫలం కావడంతో పాంటింగ్ సరసన నిలవలేకపోయాడు.
16. 43 వన్డే సిరీస్‌లకుకు ధోని సారథిగా వ్యహరించాడు. ఇది భారత్ తరపున అత్యధికం కాగా, ఓవరాల్‌గా నాల్గోది.
17. భారత్ సాధించిన విజయాల్లో వన్డే కెప్టెన్‌గా ధోని యావరేజ్ 70.83గా ఉంది. కనీసం వెయ్యి పరుగుల సాధించిన ఓవరాల్ కెప్టెన్లలో ఇది మూడో అత్యుత్తమ యావరేజ్. ఇక్కడ దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్, సచిన్ టెండూల్కర్లు ముందువరుసలో ఉన్నారు.
18. 72 ట్వంటీ 20లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్ ధోని
19. భారత జట్టు 110 వన్డే విజయాలకు ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. భారత్ తరపున ఇదే అత్యధికం కాగా, ఒక జాతీయ జట్టుకు అత్యధిక వన్డే విజయాలను అందించిన రెండో కెప్టెన్ గా ధోని నిలిచాడు. అగ్రస్థానంలో పాంటింగ్(165) ఉన్నాడు.
20. కెప్టెన్ గా ధోని కొట్టిన సిక్స్లులు 126. ఓవరాల్ కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత ధోనిది.
21. 199 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక భారత్ ఆటగాడు ధోని. ఓవరాల్‌గా మూడో స్థానంలో ఉన్నాడు.
22. అన్ని ఫార్మాట్లలో 331 మ్యాచ్లకు ధోని సారథిగా వ్యవహరించాడు. ఇదే ఓవరాల్‌గా అత్యధికం.
Comments
Please login to add a commentAdd a comment