31 ఏళ్లు...31 మొక్కలు | Kangana Ranaut celebrates her 31st birthday by planting 31 trees | Sakshi
Sakshi News home page

31 ఏళ్లు...31 మొక్కలు

Published Sat, Mar 24 2018 12:39 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

Kangana Ranaut celebrates her 31st birthday by planting 31 trees - Sakshi

కంగనా రనౌత్‌,∙మొక్కలు నాటుతూ...

బర్త్‌డే వస్తుందంటే చాలు! ఎప్పుడు? ఎక్కడ? ఎవరితో సెలబ్రేట్‌ చేసుకోవాలో ప్లాన్‌ చేసుకోవడం సహజం. కొంతమంది మాత్రం సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. వాళ్లలో కంగనా రనౌత్‌ ఒకరు. ఈవిడగారి రూటే సెపరేటు. ఎందుకంటే బర్త్‌డే సందర్భంగా ఆమె స్వయంగా గోతులు తవ్వారు. దేవుడా... ఏంటిది అనుకుంటున్నారా? ఆమె గోతులు తవ్వింది మంచి పనికే. మొక్కలు నాటడానికి. శుక్రవారం (మార్చి 23) కంగనా బర్త్‌డే. 31వ వసంతంలోకి అడుగుపెట్టారామె.

అందుకే మనాలీలో ఉన్న తన ఇంటి చుట్టుపక్కల వారం రోజుల నుంచి 31 మొక్కలను నాటారు కంగనా. అంటే.. సంవత్సరానికో మొక్క అన్నట్లు లెక్క. విశేషం ఏంటంటే ప్రపంచ వాతావారణ శాస్త్ర దినోత్సవం కూడా మార్చి 23నే. సీన్‌ భలే కనెకై్టంది కదూ! బర్త్‌డే సందర్భంగా కంగనా మాట్లాడుతూ– ‘‘ఈ బర్త్‌డే సందర్భంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నాను. పియానో నేర్చుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ట్రైనర్‌ దగ్గర పాఠాలు వింటున్నా. మా ఇంట్లో మా అమ్మ కూరగాయలు పెంచుతారు. అలా గార్డెనింగ్‌ పట్ల నాకు ఇంట్రెస్ట్‌ మొదలైంది. అందుకే ఈ ఏడాది మొక్కలు నాటాను.

గొయ్యి తవ్వి ఒక్కో మొక్క నాటడానికి అరగంటకుపైగా టైమ్‌ పట్టింది. అఫ్‌కోర్స్‌ ఇదొక స్ట్రెస్‌బస్టర్‌లా కూడా అనిపించింది. నా బర్త్‌డే సందర్భంగా టెంపుల్‌కి వెళ్లాను. ఫ్యామిలీ అంతా కలిసి లంచ్‌ చేశాం’’ అన్నారు. కంగనా టైటిల్‌ రోల్లో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితం ఆధారంగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ షూటింగ్‌ కంప్లీటైందని సమాచారం. ఆగస్టులో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం ప్రకాశ్‌ కొవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మెంటల్‌ హై క్యా’ చిత్రంతో బిజీగా ఉన్నారు కంగనా రనౌత్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement