Salman Khan to Share his Birthday with Arpita Khan's Second Child? - Sakshi
Sakshi News home page

ఇక బర్త్‌డేను షేర్‌ చేసుకోనున్న సల్మాన్‌!

Published Thu, Dec 26 2019 4:51 PM | Last Updated on Thu, Dec 26 2019 5:55 PM

Salman Khan To Share His Birthday With Arpita's Baby - Sakshi

ముంబై: బాలీవుడ్‌ దబాంగ్‌, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ 54వ పుట్టినరోజు వేడుకలు జోరందుకున్నాయి. తన చెల్లెలు అర్పిత, తన భర్త ఆయుష్‌ శర్మలు సల్మాన్‌ పుట్టినరోజుకు ఇ‍వ్వబోయే బెస్ట్‌ గిఫ్ట్‌ (అపూరుపమైన బహుమతి) కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే.. ఇప్పటికే నిండు గర్భవతైన అర్పితా, సల్మాన్‌ బర్త్‌డే రోజునే రెండో పిల్లాడికి జన్మనివ్వనుంది. దీంతో సల్మాన్‌ ఖాన్‌ ఖాందన్‌లో ఇప్పటికే డబుల్‌ సెలెబ్రెషన్స్‌ ప్రారంభమయ్యాయి. ఇక సల్మాన్‌ ఖాన్‌ ఇప్పటినుంచి తన పుట్టినరోజును స్పెషల్‌ పర్సన్‌తో షేర్‌ చేసుకోనున్నాడు.

ప్రతి ఏడాది బర్త్‌డే పార్టీని గ్రాండ్‌గా నిర్వహించినట్లుగానే.. ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు. సల్మాన్‌ తమ్ముడు సోహైల్‌ ఖాన్‌ ఇంట్లో పార్టీ జరుగనుండడంతో.. బాలీవుడ్‌ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున బర్త్‌డే వేడుకలకు హాజరుకానున్నారు. ఇక అర్పితాను డెలివరీ కోసం ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్‌కు ఈరోజు సాయంత్రం తరలించనున్నట్లు సమాచారం. 

చదవండి: ఎట్టకేలకు వంద కోట్లు దాటింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement