
‘పెళ్లి చూపులు’తో హిట్ కొట్టి అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డిలో తన నటనకు టాలీవుడ్ మొత్తం ఫిదా అయ్యింది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో వచ్చిన స్టార్‌డమ్... విజయ్‌కు ఆఫర్స్‌ను తెచ్చిపెట్టాయి.
నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ప్రస్తుతం విజయ్ టాక్సీవాలా, నోటా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే టాక్సీవాలా సినిమా కాన్సెప్ట్ జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ‘ద డ్రీమ్‌బిహెండ్ ద టాక్సీవాలా’ అంటూ ఓ వీడియోను రిలీజ్‌చేశారు. జనాలు కూడా ఈ వీడియోను బాగానే రిసీవ్ చేసుకున్నారు. నేడు విజయ్‌పుట్టిన రోజు సందర్భంగా టాక్సీవాలా టీం ప్రత్యేకంగా టీజర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతా2 సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment