‘ఎఫ్‌ 3’ అంతకుమించి ఉంటుంది | Birthday interview of Anil Ravipudi about F3 Movie | Sakshi
Sakshi News home page

‘ఎఫ్‌ 3’ అంతకుమించి ఉంటుంది

Published Tue, Nov 23 2021 1:07 AM | Last Updated on Tue, Nov 23 2021 1:07 AM

Birthday interview of Anil Ravipudi about F3 Movie - Sakshi

‘‘ఎఫ్‌ 2’ వల్ల వచ్చిన కిక్‌ వల్లో, ఎనర్జీ వల్లో వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌గార్లు ‘ఎఫ్‌ 3’లో ఇరగదీశారు. ప్రేక్షకుల  అంచనాలకు మించి ‘ఎఫ్‌ 3’ వారికి వినోదాన్ని పంచుతుంది’’ అన్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. 2015లో వచ్చిన ‘పటాస్‌’ చిత్రంతో దర్శకుడిగా మారిన అనిల్‌ రావిపూడి ఆ తర్వాత ‘సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్‌ 2, సరిలేరు నీకెవ్వరు’ వంటి విజయాలతో హిట్‌ చిత్రాల దర్శకుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ‘ఎఫ్‌ 3’ సినిమా చేస్తున్నారు. మంగళవారం అనిల్‌ రావిపూడి బర్త్‌ డే (నవంబరు 23). ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో అనిల్‌ రావిపూడి చెప్పిన విశేషాలు.

► దర్శకుడిగా ఇది నా ఆరో బర్త్‌ డే. ఈసారి ‘ఎఫ్‌3’ సెట్స్‌లోనే నా పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. నా దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్‌ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ముందుగా అనుకున్నట్లు ఈ సంక్రాంతికి ‘ఎఫ్‌ 3’ రిలీజ్‌ అయితే హ్యాట్రిక్‌ అయ్యేది. సంక్రాంతి రిలీజ్‌ మిస్సయిందని బాధ ఉన్నప్పటికీ సోలో రిలీజ్‌ అయితే ఎక్కువమంది ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించి ఫిబ్రవరి 25న విడుదల చేయాలనుకుంటున్నాం. ఇప్పటికి ‘ఎఫ్‌ 3’ 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. కొంత టాకీ, రెండు పాటలు చిత్రీకరించాలి.

► ‘ఎఫ్‌ 2’ సినిమా భార్యాభర్తల ఫ్రస్ట్రేషన్‌ నేపథ్యంలో ఉంటుంది. కానీ ‘ఎఫ్‌ 3’ కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఇందులో వెంకటేశ్‌గారు రేచీకటి ఉన్న వ్యక్తిగా, వరుణ్‌ నత్తి ఉన్న వ్యక్తి పాత్రల్లో కనిపిస్తారు. హీరోల క్యారెక్టర్స్‌కు ఉన్న ఈ ప్రాబ్లమ్స్‌ కథను డిస్ట్రబ్‌ చేయవు. ‘ఎఫ్‌ 2’లో ఉన్న అందరూ ‘ఎఫ్‌ 3’లో ఉన్నారు. కొత్తగా సునీల్‌గారు, మురళీశర్మగారు కనిపిస్తారు. ‘ఎఫ్‌ 2’ సినిమా ఎండింగ్‌లో ‘ఎఫ్‌ 3’ అని వేశాం. కానీ అప్పుడు ‘ఎఫ్‌ 3’ కథ నా దగ్గర లేదు. కానీ మనకంటూ ఓ ఎంటర్‌టైన్‌మైంట్‌ ఫ్రాంచైజీ ఉంటే బాగుంటుందనుకుని ‘ఎఫ్‌ 3’ చేస్తున్నాం. ‘ఎఫ్‌ 4’ కూడా ఉండొచ్చేమో.

► చిన్న పిల్లలతో నేను మా ఇంట్లో చూసిన ఎలిమెంట్స్‌ అన్నీ ‘ఎఫ్‌ 3’లో ఉన్నాయి. థియేటర్లో ఫ్యామిలీ ఆడియ¯Œ ్స చూస్తే.. అరే మా ప్రాబ్లమ్స్‌ కూడా ఇవే కదా అనుకుంటారు. ‘ఎఫ్‌ 2’ అనేది నా బయోపిక్‌. ఆ మాటకొస్తే.. మగాళ్లందరి బయోపిక్‌ కూడా. ప్రతి ఒక్కరూ పని చేసే చోట, ఇంట్లో.. ఇలా ఎక్కడో చోట అలా ఫ్రస్టేట్‌ అవుతుంటారు.

► ‘ఎఫ్‌ 2’ సినిమా చేయడం వల్ల కావొచ్చు వెంకీ, వరుణ్‌ల మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌ కుదిరింది. వెంకీ, వరుణ్‌ల వల్ల కాదు కానీ హీరోయిన్లు (తమన్నా, మెహరీన్‌)ల వల్లే ఎక్కువ సమస్యలు వచ్చాయి (నవ్వుతూ). ‘ఎఫ్‌ 2’లో కన్నా  ‘ఎఫ్‌ 3’లో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు. దాదాపు 35మంది ఉన్నారు. రీసెంట్‌గా క్లైమాక్స్‌ను షూట్‌ చేశాం. అప్పట్లో ఈవీవీగారు  సినిమాలో ఎక్కువమంది ఆర్టిస్టులను ఎలా మ్యానేజ్‌ చేసేవారా అని కొన్నిసార్లు అనిపించింది.

► ఇటీవల వెంకీగారు ఫస్టాఫ్‌ చూసి, ‘నేను ఒక్కడినే బాగా చేశాననుకున్నాను.. ఇదేంటమ్మా  అందరూ ఇరగ్గొట్టేశారు’ అన్నారు. ‘ఎఫ్‌ 2’ చివర్లో కనిపించిన నేను ‘ఎఫ్‌ 3’లో ఓ సాంగ్‌లో కనిపిస్తా.

► ప్యాన్‌ ఇండియా అంటే ఆ స్థాయిలో కథ రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ (టాలీవుడ్‌) కుర్చీలో బాగున్నాను. ఒక ఏడాది అక్కడికి (బాలీవుడ్‌) వెళ్తే ఇక్కడున్న కుర్చీ సంగతి ఏంటి? ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటారు (నవ్వుతూ..). ‘ఎఫ్‌ 3’ చిత్రంలో పాన్‌ ఇండియన్‌ కంటెంట్‌ ఉంటుంది.

► ‘గాలి సంపత్‌’ నా జానర్‌ కాదు. కానీ స్క్రీన్‌ప్లే ఇచ్చాను. అయితే ఈసారి అలా చేయాలనుకోవడం లేదు. ప్రేక్షకులు నా నుంచి ఏం ఆశిస్తున్నారో అదే చేయాలనుకుంటాను. కానీ స్నేహితులకు నేను చేయాల్సింది చేస్తాను. అలాగే నా కథను ఎవరికీ ఇవ్వను. అన్ని కథలు నా దగ్గర లేవు.

► ‘దిల్‌’ రాజుగారికి ‘ఎఫ్‌ 3’ కథ పూర్తిగా వినిపించలేదు.. రెండు మూడు సీన్లు వినిపించాను. ఆయన బేనర్‌లో వరుసగా చేస్తున్నాను. ‘దిల్‌’ రాజుగారు నా రెమ్యూనరేషన్‌ పెంచారు. రీసెంట్‌గా కొత్త ఇల్లు కొనుక్కున్నాను. ఎంతిస్తారు? అని ఎప్పుడూ అడగను. ఎంతిస్తే అంతే (నవ్వుతూ).

► బాలకృష్ణగారితో సినిమా ఉంది. ఆయనతో ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ సినిమా చేయలేం. జనవరి నుంచి ఆ కథ వర్కౌట్‌ చేస్తాను. జూన్, జూలైలో సెట్స్‌ మీదకు వెళ్తాం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement