
ప్రియమణి
ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా సినిమాలు కమిట్ కాని ప్రియమణి ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు ఒప్పుకున్నారు. ఒకటి ‘నారప్ప’, మరోటి ‘విరాట పర్వం’. గురువారం ఈ బ్యూటీ బర్త్‌డే సందర్భంగా రెండు చిత్రాల్లోని ప్రియమణి ఫస్ట్ లుక్స్‌ను విడుదల చేశారు. వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నారప్ప’. తమిళ హిట్ ‘అసురన్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇందులో హీరోయిన్‌గా సుందరమ్మ అనే పాత్రలో నటిస్తున్నారు ప్రియమణి. డి. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దేవి శ్రీదేవి సతీష్ ఈ చిత్రానికి సహ–నిర్మాత. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘విరాటపర్వం’ విషయానికి వస్తే...రానా, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్ ప్రధాన తారాగణంగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కామ్రేడ్ భారతక్క పాత్రలో నటిస్తున్నారు ప్రియమణి. ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ చాగంటి.
Comments
Please login to add a commentAdd a comment