‘‘గతంలోలా సినిమాలను నిర్మిస్తే ప్రేక్షకులు వాటిని ఆదరించే పరిస్థితిలో లేరు. కథ కొత్తగా ఉంటేనే ఆదరిస్తారు. అందుకే నేను ఇక నుంచి తీసే సినిమాల కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించాలనుకుంటున్నాను’’ అని నిర్మాత అడ్డాల చంటి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని విలేకరులతో మాట్లాడుతూ– ‘‘1982లో ప్రముఖ కళా దర్శకుడు భాస్కరరాజుగారి దగ్గర, ఆయన కుమారుడు ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజుగారి దగ్గర అసిస్టెంట్‌గా జీవితాన్ని ప్రారంభించాను. తక్కువ కాలంలోనే ఆర్ట్ అసిస్టెంట్ నుండి ఆర్ట్ డైరెక్టర్‌గా మారాను. కళా దర్శకునిగా నాకు జీవితం ఇచ్చింది నిర్మాత రామానాయుడుగారు. ఆర్ట్ డైరెక్టర్‌గా నా మొదటి చిత్రం ‘ప్రేమ’.
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున.. ఇలా దాదాపు అందరి హీరోల సినిమాలకు పనిచేసి, ‘చంటి మనవాడే’ అనే పేరు త్వరగా తెచ్చుకున్నాను. కెమెరామేన్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఫ్రెండ్లీ మూవీస్ అనే సంస్థను ప్రారంభించి బాలకృష్ణతో ‘పవిత్ర ప్రేమ’, ‘కృష్ణబాబు’ నిర్మించాము. ఆ తర్వాత నేను సోలో నిర్మాతగా మారి ఎన్టీఆర్‌తో ‘అల్లరి రాముడు’’, ప్రభాస్‌తో ‘అడవి రాముడు’ తరుణ్‌తో ‘ఒక ఊరిలో’ చిత్రాలను నిర్మించాను. ఈ ఏడాది ప్యాన్ ఇండియా ఫిల్మ్ నిర్మించబోతున్నాను. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అనే ట్రెండ్ నడుస్తోంది. అందుకే ఓటీటీలో చిన్న బడ్జెట్ సినిమాలను, వెబ్‌సిరీస్‌లను నిర్మించేందుకు కథలు సిద్ధం చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment