chanti addala
-
'అతని వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యింది'
ఆర్తి అగర్వాల్..తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. చిరంజీవి,వెంటకేష్, తరుణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ సహా దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ జతకట్టింది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్లో స్టార్ ఇమేజ్‌ని సంపాదించుకుంది. కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉండగానే పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. హీరో తరుణ్‌తో ప్రేమాయణం, ఆపై ఆత్మహత్యాయత్నం వంటివి ఆమె కెరీర్లో కోలుకోలేని దెబ్బతీశాయి. తాజాగా ఆర్తి అగర్వాల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడం, ఆమె కెరీర్ ఫేడ్ అవ్వడానికి గల కారణలపై నిర్మాత చంటి అడ్డాల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె తండ్రి ఆర్తి అగర్వాల్‌కు సంబంధించి ప్రతీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడని,షూటింగ్‌కు కరెక్ట్ టైంకు వెళ్తానంటే కూడా అడ్డు చెప్పేవాడని పేర్కొన్నారు. ఆర్తి అగర్వాల్ వాళ్ల పేరెంట్స్ మీద చాలా వరకు డిపెండ్ అయ్యేదని, వాళ్లు ఏం చేయమంటే అది చేసేదని చెప్పారు. 'వాళ్ల పేరెంట్స్ షూటింగ్ లొకేషన్‌కి రానప్పుడు చాలా కన్వినెంట్‌గా పనిచేసేది. అదే వాళ్లు వచ్చారంటే మాత్రం ఈమెతో పని చేయనిచ్చేవారు కాదు. ఆర్తి అగర్వాల్ తండ్రీ ప్రతిదానికి అడ్డుపడేవాడు. షూటింగ్ ప్యాకప్ ఎప్పుడు చెప్పాలో కూడా ఆయనే డిసైడ్ చేసేవాడు. వాళ్ల ఫాదర్ వళ్లే ఆర్తి అగర్వాల్ ఇబ్బంది పడేది. ఆయన లేకపోతే ఆమె చాలా ఫ్రీగా పనిచేసేది. నిజానికి ఆమె కెరీర్ ఫేడ్ అవుట్ అవ్వడానికి ఆమె తండడ్రే కారణం' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బరువు తగ్గేందుకు చేయించుకున్న ఆపరేషన్ వికటించి 2015 జూన్ 6న ఆర్తి అగర్వాల్ గుండెపోటుతో మరణించింది. చదవండి : తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా.. ఆ హీరోతో సినిమా? ఆ కారణంతో సినిమాలు మానేద్దామనుకున్న సౌందర్య -
కీర్తి మూవీపై ముదురుతున్న వివాదం
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో ఇద్దరు నిర్మాతల మధ్య వివాదం చెలరేగుతోంది. ‘ఐనా నువ్వంటే ఇష్టం’ సినిమా హక్కుల కోసం నిర్మాతలు నట్టి కుమార్, చంటి అడ్డాల మధ్య వివాదం ఏర్పడింది. సినిమా హక్కులకు సంబంధించి తనకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదని నిర్మాత నట్టి కుమార్‌పై చంటి అడ్డాల బంజారాహీల్స్ పోలీస్ట్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. ఫీల్మ్ ఛాంబర్లోనూ అతనిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మూవీలో సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ, మహానటి కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. ఇద్దరి మధ్యగల వివాదాన్ని ఫ్రెండ్లీ మూవీస్ యజమాని చంటి అడ్డాల గురువారం మీడియాకు వివరించారు. నట్టి కుమార్ తనకున్న పలుకుబడితో ఫిల్మ్ ఛాంబర్‌ను సైతం మేనేజ్ చేశాడని చంటి ఆరోపించారు. మూవీ పోస్టర్‌పై తన పేరును తొలగించి తన పేరును వేయించుకున్నాడని తెలిపారు. ఛాంబర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాక కూడా తన సినిమాను తన సినిమాగా చెప్పుకుంటున్నాడని వాపోయారు. కీర్తి సురేష్‌కు గతంలో కంటే ప్రస్తుతం క్రేజ్ పెరిగిపోవడంతోనే లాభం కోసం తనను మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. చంటి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. మరోవైపు దీనిపై సినీ నిర్మాత నట్టి కుమార్ భిన్నంగా స్పందించారు. చంటి అడ్డాల తనకు కాకుండా మరో ముగ్గురికి సినిమా విక్రయించారని ఆరోపించారు. తనను మోసం చేసినందుకు పోలీస్ కేసు కూడా పెట్టినట్లు తెలిపారు. -
ప్యాన్ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నా
‘‘గతంలోలా సినిమాలను నిర్మిస్తే ప్రేక్షకులు వాటిని ఆదరించే పరిస్థితిలో లేరు. కథ కొత్తగా ఉంటేనే ఆదరిస్తారు. అందుకే నేను ఇక నుంచి తీసే సినిమాల కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించాలనుకుంటున్నాను’’ అని నిర్మాత అడ్డాల చంటి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని విలేకరులతో మాట్లాడుతూ– ‘‘1982లో ప్రముఖ కళా దర్శకుడు భాస్కరరాజుగారి దగ్గర, ఆయన కుమారుడు ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజుగారి దగ్గర అసిస్టెంట్‌గా జీవితాన్ని ప్రారంభించాను. తక్కువ కాలంలోనే ఆర్ట్ అసిస్టెంట్ నుండి ఆర్ట్ డైరెక్టర్‌గా మారాను. కళా దర్శకునిగా నాకు జీవితం ఇచ్చింది నిర్మాత రామానాయుడుగారు. ఆర్ట్ డైరెక్టర్‌గా నా మొదటి చిత్రం ‘ప్రేమ’. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున.. ఇలా దాదాపు అందరి హీరోల సినిమాలకు పనిచేసి, ‘చంటి మనవాడే’ అనే పేరు త్వరగా తెచ్చుకున్నాను. కెమెరామేన్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఫ్రెండ్లీ మూవీస్ అనే సంస్థను ప్రారంభించి బాలకృష్ణతో ‘పవిత్ర ప్రేమ’, ‘కృష్ణబాబు’ నిర్మించాము. ఆ తర్వాత నేను సోలో నిర్మాతగా మారి ఎన్టీఆర్‌తో ‘అల్లరి రాముడు’’, ప్రభాస్‌తో ‘అడవి రాముడు’ తరుణ్‌తో ‘ఒక ఊరిలో’ చిత్రాలను నిర్మించాను. ఈ ఏడాది ప్యాన్ ఇండియా ఫిల్మ్ నిర్మించబోతున్నాను. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అనే ట్రెండ్ నడుస్తోంది. అందుకే ఓటీటీలో చిన్న బడ్జెట్ సినిమాలను, వెబ్‌సిరీస్‌లను నిర్మించేందుకు కథలు సిద్ధం చేస్తున్నాను’’ అన్నారు. -
డబుల్ ధమాకా
ప్రభాస్‌తో ‘అడవి రాముడు’, జూ. ఎన్టీఆర్‌తో ‘అల్లరిరాముడు’ వంటి చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల త్వరలో రెండు కొత్త సినిమాల నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కళా దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన ఆయన నిర్మాతగా మారారు. పలువురు ప్రముఖ హీరోలతో అభిరుచి కలిగిన చిత్రాలు నిర్మించిన ఆయన పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చంటి అడ్డాల మాట్లాడుతూ– ‘‘సినీరంగంలో 38 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పటివరకు పది సినిమాలను నిర్మించాను. ప్రేక్షకుల అభిరుచి, ట్రెండ్‌కు తగ్గట్టుగా చిత్రాలను నిర్మించిన నేను అదేపంథాలో మరో రెండు సినిమాలు నిర్మిస్తున్నాను. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ శిష్యుడు హరిహరన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీయబోతున్నాం. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ శిష్యుడు సుబ్బును దర్శకుడిగా పరిచయం చేస్తూ యూత్‌ఫుల్ కథాంశంతో మరో సినిమా నిర్మించనున్నా. పూర్తి వివరాలను త్వరలో చెబుతా’’ అన్నారు. -
ఇష్టమొచ్చినట్లు అవార్డులిస్తే సినిమాలు తీయడమెందుకు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించిన విధానం, జ్యూరీ తంతు చూస్తుంటే వార్ వన్‌సైడ్ అన్నట్లే కనిపిస్తోంది. మంచి సినిమాలకు అన్యాయం జరిగిందనే బాధ కలిగింది. మూడేళ్ల అవార్డులు ప్రకటించిన తీరు చూస్తుంటే ముందుగా ఎంపిక చేసిన సినిమాల లిస్టును ముఖ్యమంత్రికి సమర్పించినట్లు అర్థమవుతోంది’’ అని నిర్మాత చంటి అడ్డాల విమర్శించారు. ఇంకా మాట్లాడుతూ –‘‘మనం’ వంటి కుటుంబ కథాచిత్రం, ‘రుద్రమదేవి’ వంటి చారిత్రాత్మక సినిమా, ‘రేసుగుర్రం’ లాంటి కమర్షియల్ సినిమాతో పాటు ఎన్నో హిట్ సినిమాలున్నాయి. అవార్డు తీసుకునే అర్హత వీటిలో దేనికీ లేదా? ‘సెలక్షన్ కమిటీ మన చేతిలో ఉంది కదా’ అని ఇష్టమొచ్చిన సినిమాలను ఎంపిక చేసి అవార్డులిచ్చేస్తే సినిమాలు తీయడమెందుకు? అవార్డుల ఎంపిక సమయంలో జ్యూరీలో తెలిసిన వ్యక్తిగానీ, ప్రభుత్వ పరిచయాలుగానీ, రెకమెండేషన్‌గానీ ఉండాలా? అనిపిస్తోంది. ఇకపైనా ఇలాగే కొనసాగితే నంది అవార్డు వృథా అనుకోవచ్చు. అప్పట్లో నేను చేసిన ‘ప్రేమ’ (2002) సినిమాకి నంది అవార్డు వచ్చిందని కెమెరామేన్ ఎస్. గోపాల్‌రెడ్డి ఫోన్లో చెప్పారు. కానీ, మరుసటి రోజు ఆ లిస్టులో మా సినిమా లేదు. రికమెండేషన్ ఉందని మరో సినిమాకి ఇచ్చారు. ఇక్కడ వ్యక్తిగత కాంపౌండ్లు ఉండకూడదు. ఉన్నది ఒక్కటే... అదీ సినిమా కాంపౌండ్’’ అన్నారు. -
సీనియర్ నిర్మాతలకే ఇబ్బందులు తప్పడంలేదు!
‘‘నేను చిత్రపరిశ్రమకు వచ్చి ముప్ఫయ్ మూడేళ్లయ్యింది. కళాదర్శకునిగా మంచి పేరు తెచ్చుకోగలిగాను. నిర్మాణం మీద ఆసక్తి ఉండటంతో ఫ్రెండ్లీ మూవీస్ ఆరంభించాను. ఈ సంస్థ ఆరంభించిన ఈ పదహారేళ్లల్లో తొమ్మిది సినిమాలు తీశాను’’ అని అడ్డాల చంటి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోమవారం విలేకరులతో మాట్లాడుతూ -‘‘సినిమా నిర్మాణం అంత సులువు కాదు. సీనియర్ నిర్మాతనైన నేనే ఓ సినిమా చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఇక కొత్త నిర్మాతల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది’’ అని వ్యాఖ్యా నించారు. ప్రస్తుతం అడ్డాల చంటి నిర్మిస్తున్న పదో చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’ షూటింగ్ పూర్తి చేసుకుంది. సీనియర్ నరేశ్ తనయుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయనున్నారు. సాయిధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్‌లతో త్వరలో సినిమాలు నిర్మించనున్నానని, అలాగే ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నానని అడ్డాల చంటి తెలిపారు. -
రెండేళ్లు కసరత్తులు చేశాడు : విజయనిర్మల
‘‘ఎడిటర్‌గా నవీన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాడు. నవీన్ నటిస్తున్న ఈ తొలి చిత్రం ట్రైలర్ చూశాను. చాలా ఈజ్‌తో నటించాడు. ఒక మంచి హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ నవీన్‌లో ఉన్నాయి. వచ్చే పుట్టినరోజుకు తను మంచి స్టార్డమ్ తెచ్చుకుంటాడు’’ అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. సీనియర్ నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ చంటి అడ్డాల ఓ చిత్రం నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ రగుతు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని నవీన్ విజయకృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని శుక్రవారం నాడు హైదరాబాద్‌లో విడుదల చేశారు. కృష్ణ, విజయనిర్మల, జయసుధ సంయుక్తంగా ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ -‘‘నవీన్ మంచి ఎడిటర్. హీరోగా చేయాలని ఉందనగానే, ప్రోత్సహించాం. మంచి హీరోగా నిరూపించుకోవడానికి రెండేళ్ల పాటు తగిన కసరత్తులు చేసి, రంగంలోకి దిగాడు’’ అని చెప్పారు. నరేశ్ మాట్లాడుతూ - ‘‘ఓ విజయవంతమైన చిత్రానికి కావాల్సిన దమ్మున్న కథతో నవీన్ హీరోగా పరిచయమవుతున్నాడు. వేరే నిర్మాతలు నవీన్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చినప్పటికీ చంటి అడ్డాల మీద నమ్మకంతో ఆయన బేనర్లో సినిమా అంగీకరించాం’’ అన్నారు. ఇప్పటి వరకు జరిపిన షెడ్యూల్స్‌తో 70 శాతం సినిమా పూర్తయ్యిందనీ, వచ్చే నెలాఖరుకి మొత్తం పూర్తవుతుందని నిర్మాత తెలిపారు. నవీన్ శారీరక భాషకు వంద శాతం నప్పే కథ ఇదని దర్శకుడు చెప్పారు. మంచి కమర్షియల్ అంశాలున్న చిత్రమిదని నవీన్ విజయకృష్ణ తెలిపారు. -
నవీన్ బ్లడ్‌లోనే నటన ఉంది!
‘‘ఈ ఏడాది మా సంస్థ నుంచి మూడు చిత్రాలు విడుదలవుతాయి. ముందుగా నవీన్‌తో చేస్తున్న చిత్రం విడుదలవుతుంది. ఎడిటింగ్ శాఖలో తన ప్రతిభను నిరూపించుకున్న నవీన్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. అతని రక్తంలోనే నటన ఉంది. అలాగే, ఈ చిత్రదర్శకుడు రాంప్రసాద్ రౌతు చాలా ప్రతిభావంతుడు. ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్‌తో మూడు పాటలు, కొంత భాగం టాకీ పూర్తయ్యాయి’’ అని చంటి అడ్డాల తెలిపారు. నటుడు నరేశ్ తనయుడు నవీన్‌ని పరిచయం చేస్తూ, అడ్డాల చంటి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా అలనాటి నటి మేనక (‘పున్నమినాగు’ హీరోయిన్) కుమార్తె కీర్తి సురేశ్ పరిచయమవుతోంది. మరో నాయికగా చాందిని నటిస్తోంది. ఈ చిత్రంలో నాగబాబు కీలక పాత్ర చేస్తున్నారు. భవిష్యత్ ప్రణాళికల గురించి అడ్డాల చంటి చెబుతూ -‘‘ఓ అగ్ర హీరోతో సినిమా చేయబోతున్నాను. లొకేషన్స్ కోసం వచ్చే నెల దక్షిణాఫ్రికా వెళతాం’’ అన్నారు. -
ఫ్రెండ్లీ మూవీస్ చిత్రం 80 శాతం పూర్తి
-
నిర్మాతలకు విలువనిచ్చే రోజులు రావాలి
‘‘గతంలో నిర్మాతలకు ఎంతో విలువ ఉండేది. కానీ, ఇప్పుడది లేదు. మళ్లీ నిర్మాతలకు విలువనిచ్చే రోజులు రావాలని కోరుకుంటున్నా. అలాగే చిత్రపరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు చంటి అడ్డాల. కళాదర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంటి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మూడు దశాబ్దాలకు పైగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న ఆయన పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ - ‘‘నరేష్ తనయుడు నవీన్‌ని హీరోగా పరిచయం చేస్తూ, ఓ సినిమా నిర్మించనున్నాను. కృష్ణవంశీ శిష్యుడు రామ్‌ప్రసాద్ రౌతు ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. ఓ ముక్కోణపు ప్రేమకథతో ఈ చిత్రం సాగుతుంది. నవీన్ ముంబయ్‌లో నటనపరంగా శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తాడు. ఇందులో ఇద్దరు కథానాయికలు. ఈ చిత్రంలోని ఆరు పాటలకు ప్రముఖ బాలీవుడ్ నృత్యదర్శకురాలు వైభవీ మర్చంట్ నృత్యాన్ని సమకూర్చనున్నారు. ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం’’ అని చెప్పారు. ప్రేక్షకులను సంతృప్తిపరిచే సినిమాలు ఇవ్వాలన్నదే తన ఆకాంక్ష అని, నవీన్ సినిమా తర్వాత ఓ పెద్ద హీరోతో భారీ చిత్రం చేయాలనుకుంటున్నానని చంటి చెప్పారు.