సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్‌లో ఇద్దరు నిర్మాతల మధ్య వివాదం చెలరేగుతోంది. ‘ఐనా నువ్వంటే ఇష్టం’ సినిమా హక్కుల కోసం నిర్మాతలు నట్టి కుమార్, చంటి అడ్డాల మధ్య వివాదం ఏర్పడింది. సినిమా హక్కులకు సంబంధించి తనకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదని నిర్మాత నట్టి కుమార్‌పై చంటి అడ్డాల బంజారాహీల్స్ పోలీస్ట్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఫీల్మ్ ఛాంబర్‌లోనూ అతనిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మూవీలో సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ, మహానటి కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు.
ఇద్దరి మధ్యగల వివాదాన్ని ఫ్రెండ్లీ మూవీస్ యజమాని చంటి అడ్డాల గురువారం మీడియాకు వివరించారు. నట్టి కుమార్ తనకున్న పలుకుబడితో ఫిల్మ్ ఛాంబర్‌ను సైతం మేనేజ్ చేశాడని చంటి ఆరోపించారు. మూవీ పోస్టర్‌పై తన పేరును తొలగించి తన పేరును వేయించుకున్నాడని తెలిపారు. ఛాంబర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాక కూడా తన సినిమాను తన సినిమాగా చెప్పుకుంటున్నాడని వాపోయారు. కీర్తి సురేష్‌కు గతంలో కంటే ప్రస్తుతం క్రేజ్ పెరిగిపోవడంతోనే లాభం కోసం తనను మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. చంటి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. మరోవైపు దీనిపై సినీ నిర్మాత నట్టి కుమార్ భిన్నంగా స్పందించారు. చంటి అడ్డాల తనకు కాకుండా మరో ముగ్గురికి సినిమా విక్రయించారని ఆరోపించారు. తనను మోసం చేసినందుకు పోలీస్ కేసు కూడా పెట్టినట్లు తెలిపారు.
కీర్తి సురేష్ మూవీపై ముదురుతున్న వివాదం
Published Thu, Oct 1 2020 2:36 PM | Last Updated on Thu, Oct 1 2020 5:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment