
భువనేశ్వర్ కుమార్
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో స్వింగ్ కింగ్‌గా పిలుచుకునే పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు జన‍్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నేటితో (ఫిబ్రవరి 5)న 29వ ఒడిలోకి అడుగుపెడుతున్న భువనేశ్వర్‌కు పలువురు క్రికెటర్లు విషెస్ తెలియజేశారు. అందులో మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు ప్రస్తుత టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న మురళీ విజయ్, దేశవాళీ టోర్నీలతో బిజీగా ఉన్న కరుణ్ నాయర్‌లు శుభాకాంక్షలు తెలియజేశారు.
'వెరీ హ్యాపీ బర్త్ డే మిస్టర్ 'డిపెండ్‌బుల్'. బంతితో వికెట్లు, బ్యాట్‌తో పరుగులు చేస్తూ క్రికెట్ కెరీర్‌లో ముందుకు సాగు' అని సచిన్ ట్వీట్ చేశాడు.' ఫీల్డ్‌లో ప్రతీసారి సత్తాచాటుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న భువీకి హ్యాపీ బర్త్ డే. ఇలాగే మరింతగా మెరవాలని ఆశిస్తున్నా' వీవీఎస్ తన ట్వీటర్ అకౌంట్‌లో పేర్కొన్నాడు.' హ్యాపీ బర్త్ డే బ్రదర్.. ఈ ఏడాది కూడా స్వింగ్‌తో మరిన్ని ఎక్కువ వికెట్లను సాధించు' అని మురళీ విజయ్ విషెస్ తెలియజేశాడు. ' భువీకి వెరీ హ్యాపీ బర్త్ డే. నీకు ఇదొక అద్భుతమైన రోజు.. రాబోవు కాలంలో మరిన్ని వికెట్లతో సత్తాచాటుతావని ఆశిస్తున్నా' అని కరుణ్ నాయర్ అభినందించాడు. 'మా స్వింగ్ కింగ్‌కు ఇవే మా పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment