
ముంబై : కేదార్‌నాథ్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ రెండో సినిమా సింబాతో రూ 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి క్రేజీ హీరోయిన్‌గా మారింది. సైఫ్ అలీ ఖాన్ గారాల పట్టి సారా 24వ పుట్టినరోజు కావడంతో ఈరోజంతా ఆమె పార్టీల్లో మునిగితేలుతుంది అనుకుంటే పొరపడినట్టే. బర్త్‌డే రోజూ ఈ భామ షూటింగ్‌తోన బిజీబిజీగా గడపనున్నారు. వరుణ్ ధావన్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న కూలీ నెంబర్ 1 రీమేక్ షూటింగ్ కోసం సారా ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉన్నారు.
బర్త్‌డే రోజు పనికి విరామం ఇచ్చేందుకు మూవీ రూపకర్తలు ముందుకొచ్చినా సారా సున్నితంగా తోసిపుచ్చినట్టు తెలిసింది. గత ఏడాది సైతం బర్త్‌డే రోజు ఆమె తన తొలి మూవీ కోసం సన్నద్ధమయ్యేందుకు రోజంతా డ్యాన్స్ ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఇక ఈసారి బ్యాంకాక్‌లో షూటింగ్‌లో ఉండటంతో సెట్‌లోనే బర్త్‌డేను జరుపుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment