
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పుడూ వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటాడు. తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ‘అల్లుడు శ్రీను’తో వెండితెరకు పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు చేసింది ఏడు సినిమాలే అయినా కావాల్సినంత గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ అతన్ని ఎక్కువగా పరాజయాలే పలకరించినా మొక్కవోని దీక్షతో వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆయన నటించిన ‘రాక్షసుడు’ సూపర్ హిట్‌ను అందుకుంది. విమర్శకులు సైతం ఈ చిత్రానికి ప్రశంసలు కురిపించారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేశ్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నేడు బెల్లంకొండ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం బెల్లంకొండ శ్రీనివాస్ లుక్‌ను విడుదల చేసింది. ఇందులో బెల్లంకొండ కత్తుల్ని దించుతున్న చూపులతో వేడి పుట్టిస్తున్నాడు. ‘కందిరీగ’, ‘హైపర్’ వంటి హిట్ సినిమాలు అందించిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్‌పై జి. సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీప్రసాద్. చదవండి: సవాళ్లంటే ఇష్టం
Comments
Please login to add a commentAdd a comment