‘నీలో ఏమాత్రం మార్పు లేదు’ | Celebrities Wish To Trisha Krishnan For Her Birthday | Sakshi
Sakshi News home page

‘నీలో ఏమాత్రం మార్పు లేదు’

Published Mon, May 4 2020 12:59 PM | Last Updated on Mon, May 4 2020 3:17 PM

Celebrities Wish To Trisha Krishnan For Her Birthday - Sakshi

హీరోయిన్‌ త్రిష తనదైన నటనతో‌ దక్షిణాదిలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేశారు త్రిష. ఇక పలు అగ్రహీరోల సరసన నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటి త్రిష నేడు (మే4) 37 వసతంలోకి ఆడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ట్వీటర్‌ వేదికగా త్రిషకు బర్త్‌డే విషెస్‌‌ తెలియజేస్తున్నారు. (టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు)

‘హ్యాపి బర్త్‌డే డియర్‌. ఎల్లప్పుడు నువ్వు బలంగా, సానుకూలంగా ఉండాలి’ అని సీనియర్‌‌ నటి రాధిక శరత్‌కుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా త్రిష, కీర్తి సురేష్‌లతో దిగిన ఫొటోను ఆమె ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మరో నటి కుష్బూ కూడా త్రిషకు.. బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. ‘ఇప్పటికీ నీలో ఏ మాత్రం మార్పు లేదు. అదే సంతోషం, మంచి మనసు కలిగి ఉన్నావు. నీకు సంతోషం, ప్రేమ, ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.  ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది రజినీకాంత్‌ పేట చిత్రంలో కనిపించారు. అంతకు ముందు తమిళ చిత్రం ‘96’లో జానకి దేవి పాత్రలో ఆమె అద్భుతమైన నటనను కనబరిచారు. ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement