బాపూజీ అడుగు జాడల్లో నడుద్దాం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన బాపూజీ అడుగు జాడల్లో నడుద్దామని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ , లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలను ఆదివారం స్థానిక కష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన జరుపుకున్నారు. జాతిపిత చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ వంటి ఉద్యమాలు చేపట్టి దేశ ప్రజలను గాంధీజి ఏకతాటిపై నడిపించారన్నారు. మహాత్ముని సేవలు మరువలేనివన్నారు. అహింసా ఉద్యమంతో గాంధీజీ ప్రపంచ నేత అయ్యారని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ అన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కర్నాటి పుల్లారెడ్డి, రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.