
ముంబై : స్టార్ హీరోల బర్త్ డే వస్తుందంటే చాలు వారి అభిమానులంతా వారం రోజుల ముందునుంచే తెగ హడావుడి చేస్తూంటారు. ఇంకా బర్త్ డే రోజైతే వారి హంగామా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పెద్ద పెద్ద కేకులు కట్ చేయడం, రక్తాదానాలు చేయడం, పండ్లు పంచడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే ఇంకా నెలరోజులు ఉండగానే అభిమానుల హంగామా మొదలైంది. కింగ్ ఖాన్ చిన్నప్పటి ఫోటోలకు ‘షారుక్ డేకు ఇంకా నెలరోజు ఉందని, మరో 30 రోజుల్లో బిగ్ డే రానుంది’ అనే హాష్ ట్యాగ్‌తో షేర్ చేస్తున్న ఫోటోలు ట్విటర్‌లో, బ్లాగింగ్ సైట్లలో ట్రెండ్ అవుతున్నాయి. ఇలా నెలరోజుల ముందే షారుక్ ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానులు చేస్తున్న హడావుడి చూస్తుంటే.. ఈ సారి తమ అభిమాన హీరోను ట్విటర్ ట్రేండింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలబెట్టేలా కనిపిస్తున్నారు.
కాగా బాద్‌షా చిన్ననాటి ఫోటోలకు ‘లిటిల్, క్యూట్ స్వీట్ నైస్ లుకింగ్ కింగ్ ఖాన్, వన్ మంత్ టూ షారుక్ డే.. లవ్ యూ కింగ్ ఖాన్’ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. అలాగే ‘ స్టార్ డమ్ అంటే ఎంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నవంబర్ 2న మన్నత్‌కు రండి! అంటూ షారుక్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా ఆహ్వనిస్తున్నారు. ఇందులో భాగంగా.. భాగీ ఫేం టైగర్ ష్రాఫ్ ఓ చాట్‌షోలో మాట్లాడుతూ... ‘నాకు అందరు ఖాన్‌లు ఇష్టమే కానీ.. ఎందుకో తెలియదు నేను ఎప్పుడు షారుఖ్ ఖాన్ సార్‌నే ఎక్కువగా ఇష్టపడతా’ అని చెప్పుకొచ్చిన వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అది చూసి నెటిజన్లంతా షారుక్‌కు సినిమా పరంగానే కాకుండా ఇంకా చాలా విషయాలు తమను అతడి పిచ్చి అభిమానులుగా మార్చివేశాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Little cute sweet beautiful nice looking king👑 khan.... #1MonthForSRKDay #1MonthToSRKDay
— Kazi raees roy(Srkian) (@roy_kazi) October 1, 2019
Love❤😘 you king👑 khan pic.twitter.com/NvmilG0N56
Apart from movies , there are lots of things which inspire us to be his fans . pic.twitter.com/JeohqW3LwF
— तूफान का देवता ᵀʰᵒʳ 🚩 (@iStormbreaker_) October 1, 2019
#1MonthForSRKDay
Comments
Please login to add a commentAdd a comment