
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి జట్టును కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్‌లో 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్.. 17 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో కుల్దీప్‌కు ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం గమనార్హం. టీ20ల్లో కుల్దీప్‌కు రెండో ఫైవ్ వికెట్ల హాల్.
అంతేకాకుండా గురువారం(డిసెంబర్ 14) కుల్దీప్ యాదవ్ 29వ వసంతంలోకి అడుగుపెట్టాడు. తద్వారా కుల్దీప్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ టీ20 క్రికెట్‌లో పుట్టిన రోజున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అదే విధంగా టీ20ల్లో సేనా దేశాల్లో(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ,ఆస్ట్రేలియా) రెండు సార్లు ఐదు వికెట్లు ఘనత సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా కూడా కుల్దీప్ నిలిచాడు.
చదవండి: Who Is Satheesh Shubha: అరంగేట్ర మ్యాచ్‌లోనే అదుర్స్.. ఆర్సీబీ జట్టుతో! ఎవరీ శుభా సతీష్?
Comments
Please login to add a commentAdd a comment