లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. తన 8 ఓవర్ల కోటాలో 39 పరుగులు ఇచ్చి ఓ వికెట్ యాదవ్ పడగొట్టాడు. ముఖ్యంగా దక్షిణాప్రికా బ్యాటర్ మార్కరమ్‌ను కుల్దీప్ ఔట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ వేసిన కుల్దీప్.. ఓ అద్భుమైన బంతితో మార్కరమ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ వేసిన ఈ పదునైన బంతి గింగిరాలు తిరుగుకుంటూ వికెట్లను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. కాగా 2019 వన్డే ప్రపంచకప్‌లో కూడా కుల్దీప్ ఇటువంటి బంతితోనే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను క్లీన్ బౌల్డ్ చేశాడు.
Absolute Beaut! 🙌 🙌@imkuldeep18 gets Aiden Markram out with a ripper! 👍 👍 #TeamIndia
— BCCI (@BCCI) October 6, 2022
Follow the match ▶️ https://t.co/d65WZUUDh2
Don’t miss the LIVE coverage of the #INDvSA match on @StarSportsIndia. pic.twitter.com/KMajjtsA67
Comments
Please login to add a commentAdd a comment