Do not put Flexes and Banners, Instead of this Donate Money to CM Fund on my birthday - KTR - Sakshi
Sakshi News home page

పుట్టినరోజున ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు వద్దు: కేటీఆర్‌

Published Mon, Jul 23 2018 3:15 AM | Last Updated on Tue, Oct 2 2018 7:32 PM

Do not have flexes and holidays on birthday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయొద్దని మంత్రి కె.తారకరామారావు అభిమానులను కోరారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే నగరంలో అక్కడక్కడ పెట్టిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, మేయర్‌లను కోరారు.

మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పత్రికలు, టీవీలకు ఇచ్చే ప్రకటనల ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేయాలని పిలుపునిచ్చారు. పూల బొకేలు, ఫ్లెక్సీలకు అయ్యే చిన్న మొత్తాలను సైతం సీఎం సహాయ నిధికి పంపించాలని కోరారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement