కోడెదూడతో రైతు పెద్ద పుల్లయ్య కుటుంబ సభ్యులు
వెల్దుర్తి: సాధారణంగా చిన్న పిల్లల పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా కోడె దూడకు జన్మదిన వేడుకలు నిర్వహించారు సిద్ధినగట్టు గ్రామ రైతు పెద్ద పుల్లయ్య. ఈయన వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో ఉండే ఎద్దులు, ఆవులను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. ఏడాది క్రితం ఆవు కోడెదూడకు జన్మనిచ్చింది.
దానికి చింటూ అని నామకరణం చేసి ఇంటిల్లపాది మురిపెంగా చూసుకునే వారు. జూలై 4 దాని జన్మదినం కావడంతో ఆదివారం కుటుంబ సభ్యులు కోడె దూడను అలంకరించారు. చుట్టు పక్కల వారిని పిలిచి..కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment