
ముంబై: బాలీవుడ్ నటి టబు పుట్టిన రోజు సందర్భంగా సోమవారం పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో టబు సోదరి ఫరా నాజ్ తన ఇస్టాగ్రామ్ ఖాతాలో..టబుతో దిగిన చిన్ననాటి పాత ఫోటోను షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే..మై డియర్ సిస్టర్’ అని కమెంట్ పెట్టారు. దీంతో ముద్దుల మూట కడుతున్న బుల్లి టబు ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా టబు తన 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమె 1994లో బాలీవుడ్‌లో ‘పెహలా పెహలా ప్యార్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే అదే ఏడాది ఆమె నటించిన ‘విజయ్‌పథ్’ సినిమా విడుదలై బాక్సీఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇక అప్పటి నుంచి తను వెనుదిరిగి చూడలేదు. పలు విజయవంతమైన చిత్రాలు ఆమె ఖాతాలో చేరాయి. టబు..హకీఖత్, జీత్, మాచిస్ (ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది), విరాసాట్, చాచి 420, బీవీ నెం.1 వంటి సినిమాల్లో నటించారు. 2001లో తాను నటించిన ‘చాందిని బార్’ సినిమాకు రెండోసారి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. తను చివరిగా భారత్, డీ దే ప్యార్ దే, అంధాధున్ వంటి చిత్రాల్లో నటించారు. తాజాగా తాను నటించిన ‘జవానీ జానెమాన్’ సినిమా నవంబర్‌లో విడుదల కానుంది.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంలొ టబు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. యంగ్ హీరో రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డిఫరెంట్ మూవీ విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా కీలక పాత్రలో టబును అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పాత్రలో నటించేందుకు ముందుగా అంగీకరించిన టబు, తాజాగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక నో చెప్పారట. బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉండటంతో విరాటపర్వంలో నటించలేనని చెప్పేశారట.
అయితే టబు సోదరి ఫరానాజ్ కూడా బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించారు. 1985లో వచ్చిన ‘ఫాస్లే ’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఆమె యతీమ్, వో ఫిర్ ఆయేగి, బెగునా వంటి చిత్రాల్లో నటించారు. ఆమె చివరగా నటించిన చిత్రాలు శిఖర్ (2005), హల్చల్ (2004). కాగా ప్రముఖ నటి షబానా అజ్మీకి టబు మేనకోడలు అన్ని విషయం తెలిసిందే.
టబు రేర్ ఫోటోలు:
సోదరి వివాహంలో టబు..
తల్లితో టబు..
Comments
Please login to add a commentAdd a comment