క్రికెట్‌లో రన్ మెషీన్, రికార్డుల రారాజు కింగ్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు(నవంబర్ 5). కింగ్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు విరాట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా ప్లేయర్స్ కూడా కోహ్లీకి బర్త్‌డే విషెస్ చెబుతూ డ్రెస్సింగ్ రూమ్‌లో కేక్ కటింగ్ చేయించారు.
కాగా, ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా రేపు(ఆదివారం) జింబాబ్వేతో జరగబోయే టీ20 మ్యాచ్ కోసం మెల్‌బోర్న్(ఎంసీజీ) క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన పలువురు జర్నలిస్టులు విరాట్ కోహ్లీని కలిశారు. అనంతరం, గ్రౌండ్‌లోనే విరాట్‌తో కేక్ కటింగ్ చేయించారు. ఈ క్రమంలో జర్నలిస్టులు విరాట్‌కు శుభాకాంక్షలు చెబుతూ కోహ్లీతో కాసేపు సరదాగా ముచ్చటించారు. విరాట్ కూడా ఎంతో సరదాగా నవ్వుతూ వారికి సమాధానాలు ఇస్తూ హ్యాపీ మూడ్‌లో కనిపించాడు.
అయితే, జర్నలిస్టులతో మాట్లాడుతున్న సందర్భంగా పుట్టినరోజు నాడు తన మనసులోని మాట బయటపెట్టాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు మీతో(జర్నలిస్టులతో) చిన్న కేక్ కట్ చేస్తున్నాను. కానీ.. నవంబర్ 13వ తేదీన టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిస్తే పెద్ద కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకుంటాను. కేక్ కట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని ఎంతో సంతోషంతో కామెంట్స్ చేశాడు. ఇక, తనతో కేక్ కట్ చేయించిన జర్నలిస్టులకు కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Virat Kohli celebrate his birthday with journalist .
and BTW There were also those journalists who talked about removing him from the team#HappyBirthdayViratKohli pic.twitter.com/Rj9YaJHNfD— Rahul♦️ Virat (@mani_muzic) November 5, 2022
మరోవైపు.. విరాట్ కోహ్లీకి ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ) కూడా స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపింది. ఇక, కోహ్లీ బెస్ట్ దోస్త్ ఏబీ డివిలియర్స్ కూడా విరాట్‌కు వీడియో ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఏబీ డివిలియర్స్.. ‘హలో వి.. మై బిస్కట్.. ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలి. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నా.. నేను ఇక్కడ కూర్చొని బర్త్ డే విషెస్ పంపడం సరదాగా ఉంది. కోహ్లీ.. నువ్వు ఒక స్పెషల్ పర్సన్. అత్యుత్తమ క్రికెటర్‌వి. నీ స్నేహాన్ని నాకు అందించినందుకు ధన్యవాదాలు. వరల్డ్ కప్లో నీకు..టీమిండియాకు ఆల్ ది బెస్ట్. టీమిండియా ఫైనల్ చేరాలి. ప్రపంచకప్ ఫైనల్‌లో ఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టును ఎదుర్కోవాలని ఆశిస్తున్నాను అని నవ్వుతూ డివిలియర్స్ విషెస్ తెలిపాడు.
ఇక, టీ20 ప్రపంచకప్‌లో కింగ్ కోహ్లీ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. టీమిండియా ఆడిన 4 మ్యాచ్‌లో కోహ్లీ మూడు అర్ధ సెంచరీలు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీలో 220 పరుగులు చేసి ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌లో టాప్ రన్స్ సోర్కర్‌గా నిలిచాడు. కోహ్లీ ఇదే ఫామ్‌లో కొనసాగుతూ భారత్‌కు వరల్డ్‌కప్ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Dear @imVkohli,
Here is a very special wish from a very special friend. 🥳🥹#PlayBold #HappyBirthdayViratKohli @abdevilliers17 pic.twitter.com/UT7wEdnde2— Royal Challengers Bangalore (@RCBTweets) November 5, 2022
ఇది కూడా చదవండి: కోహ్లి కెరీర్‌లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు..
Comments
Please login to add a commentAdd a comment