కటారి క్రాక్‌ | Samuthirakani is First Look In Ravi Teja Crack | Sakshi
Sakshi News home page

కటారి క్రాక్‌

Published Mon, Apr 27 2020 5:47 AM | Last Updated on Mon, Apr 27 2020 5:47 AM

Samuthirakani is First Look In Ravi Teja Crack - Sakshi

సముద్రఖని ఫస్ట్‌ లుక్‌

‘డాన్‌ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత హీరో రవితేజ, డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘క్రాక్‌’. ఇందులో శ్రుతీహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సరస్వతీ ఫిలిమ్స్‌ డివిజన్‌ పతాకంపై బి. మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. అమ్మిరాజు కానుమిల్లి ఈ సినిమాకు సహనిర్మాత. లాక్‌డౌన్‌ తర్వాత జరిపే చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ముగుస్తుంది. ఆదివారం (ఏప్రిల్‌ 26) సముద్రఖని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కటారి పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో సముద్రఖని ఓ కీలక పాత్ర చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement