samudhrakhani
-
పాటలే బ్యాలెన్స్
‘క్రాక్’ షూటింగ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్’. ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమ్మిరాజు కానుమిల్లి ఈ సినిమాకు సహ నిర్మాత. ఇందులో సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయిందని చిత్రబృందం పేర్కొంది. అలాగే ఓ వారం రోజులు ప్యాచ్‌వర్క్ ఉంటుందట. షూటింగ్స్ చేయడానికి అనుమతి వచ్చిన వెంటనే ఈ రెండు పాటలను పూర్తి చేసి, వెంటనే రిలీజ్ కార్యక్రమాలు మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉంది ‘క్రాక్’ చిత్రబృందం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
కటారి క్రాక్
‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత హీరో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘క్రాక్’. ఇందులో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సరస్వతీ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. అమ్మిరాజు కానుమిల్లి ఈ సినిమాకు సహనిర్మాత. లాక్డౌన్ తర్వాత జరిపే చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ముగుస్తుంది. ఆదివారం (ఏప్రిల్ 26) సముద్రఖని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కటారి పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో సముద్రఖని ఓ కీలక పాత్ర చేస్తున్నారు. -
పాత బస్తీలో డిష్యుం డిష్యుం
పాతబస్తీలో రౌడీమూకలను ర ఫ్ఫాడిస్తున్నారు ఆఫీసర్ రవితేజ. మరి ఆ రౌడీలు తప్పు తెలుసుకున్నారా? అనే విషయం తెలుసుకోవడానికి ఇంకా సమయం ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. ‘డాన్ శీను, బలుపు’ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. శ్రుతీహాసన్ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని కీలకపాత్రలు చేస్తున్నారు. ‘ఠాగూర్’ మధు నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో ఓ పెద్ద ఫైట్‌ని చిత్రీకరించారు. నైట్ ఎఫెక్ట్‌లో సాగే ఈ ఫైట్‌ను రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ చక్కగా డిజైన్ చేశారట. ఈ సినిమా షూటింగ్ సుమారు 25 శాతం పూర్తయిందని తెలిసింది. వేసవికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
ఆలస్యం చేయకుండా అంగీకరించా!
‘ఆర్‘ఆర్ఆర్’ చిత్రానికి ప్యాన్ ఇండియా లుక్ తీసుకొచ్చే ప్లాన్‌లో కనిపిస్తున్నారు రాజమౌళి. అందులో భాగంగానే ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కో యాక్టర్‌ను ప్రాజెక్ట్‌లో భాగం చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్). రాజమౌళి దర్శకుడు. ‘ఆర్ఆర్ఆర్’లో తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ముఖ్యపాత్రలో కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం గురించి సముద్రఖని మాట్లాడుతూ – ‘‘నా తమిళ చిత్రం ‘నాడోడిగళ్’ చూసిన తర్వాత నన్ను ప్రశంసిస్తూ రాజమౌళిగారు నాకో పెద్ద మెసేజ్ పంపారు. అప్పటి నుంచి మేం టచ్‌లోనే ఉన్నాం. ఇటీవల రాజమౌళిగారు నన్ను వాళ్లింటికి ఆహ్వానించి వాళ్ల కుటుంబ సభ్యులందరికీ పరిచయం చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంది.. చేస్తారా అని అడిగారు. వెంటనే అంగీకరించాను’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రాను తీసుకున్నట్లు సమాచారం. 2020లో ఈ సినిమా రిలీజ్ కానుంది. -
నెలాఖరున ‘60 వయదు మానిరం’
తమిళసినిమా: కిళక్కు సీమయిలే చిత్రం తరువాత మనసును అంతగా హత్తుకున్న చిత్రం 60 వయదు మానిరం అని ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను పేర్కొన్నారు. వీ క్రియేషన్స్ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి పబ్లిసిటీ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈయన ఇటీవల రజనీకాంత్ హీరోగా కబాలి చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్‌ప్రభు, ప్రకాశ్‌రాజ్, సముద్రకని నటి ఇందుజా ప్రధాన పాత్రల్లో రాధామోహన్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 60 వయదు మానిరం. చాలా సైలెంట్‌గా చిత్రీకరణను, నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు. తండ్రి కొడుకుల మధ్య ప్రేమానుబంధాలను ఆవిష్కరించే ఇతి వృత్తంతో తెరకెక్కిన చిత్రామన్నారు. దీనికి సంగీతజ్ఞాని ఇళయరాజా బాణీలు కట్టడం విశేషం. సెన్సార్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తి చేసుకుంది. చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు చాలా మంచి సినిమా అంటూ ప్రశంసల జల్లు కురిపంచి యూ సర్టిఫికెట్‌ను అందించారట. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను తన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం నిర్మించిన కిళక్కు సీమయిలే చిత్రం తరువాత అంతగా నా మనసును హత్తుకున్న చిత్రం 60 వయదు మానిరం అన్నారు. చిత్రంలో ప్రకాశ్‌రాజ్ నటనకు అవార్డు రావడం ఖాయం అని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
ఫోర్ గెటప్స్‌లో...
ఊహలకు, వదంతులకు ఫుల్స్టాప్ పెట్టారు సూర్య అండ్ టీమ్. సినిమాలో నిజంగా ఎవరు నటించబోతున్నారన్న విషయాన్ని వెల్లడించారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో ముందు పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. ఫైనల్లీ సాయేషాని తీసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అలాగే మోహన్‌లాల్, అల్లు శిరీష్ నటించనున్న ఈ సినిమాలో తాజాగా సముద్రఖని, బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ యూనిట్లో యాడ్ అయినట్లు కేవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 15ఏళ్ల తర్వాత ఈ సినిమాతో బొమన్ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘‘నా నెక్ట్స్ సినిమాలో డైనమిక్ యాక్టర్ సూర్య సరసన నటించబోతున్నానని చెప్పడానికి ఆనందంగా ఉంది. బ్రిలియంట్ డైరెక్టర్ కేవీ ఆనంద్ దర్శకత్వంలో మోహన్‌లాల్, శిరీష్‌లతో నటించబోతున్నందకు ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు సాయేషా. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25న లండన్‌లో స్టార్ట్ కానుందని సమాచారం. అక్కడే ఓ పబ్ సాంగ్‌ను కూడా తీస్తారట. ఈ సినిమాలో సూర్య ఫోర్ గెటప్స్‌లో కనిపించనున్నారని టాక్. -
ఇంటిలిజెంట్ పోలీస్
తమిళ సూపర్ హిట్ చిత్రం ‘కావల్’ను తెలుగులో ‘ఇంటిలిజెంట్ పోలీస్’ పేరుతో గ్రేహక్ మీడియా పతాకంపై వీరబ్రహ్మాచారి అన్నభీజు సమర్పణలో రాజశేఖర్ అన్నభీజు విడుదల చేయనున్నారు. జె.వి రామారావు ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్. సముద్రఖని, విమలా గీత, ఎమ్మెస్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. నాగేంద్రన్ ఆర్. దర్శకుడు. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొని సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ రామారావు మాట్లాడూతూ– ‘‘తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా పూర్తి ఆసక్తికరంగా ఈ సినిమా ఉంటుంది. నటీనటులందరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్‌కు విశేష స్పందన లభిస్తోంది’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాశ్. -
భాగ్యరాజ్ పాత్రలో శశికుమార్
తమిళ సినిమా : సీనియర్ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ పాత్రలో నటుడు శశికుమార్ నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా వార్త. గతంలో మంచి విజయం సాధించిన చిత్రాలను పునర్నిర్మించడం చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే ఇటీవల సీక్వెల్స్ నిర్మాణం అధికం కావడంతో పాత చిత్రాల రీమేక్ తగ్గింది. తాజాగా నటుడు శశికుమార్ ఆ ట్రెండ్‌కు తెరలేపనున్నారు. 1982లో నటుడు కే.భాగ్యరాజ్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం తూరల్ నిండ్రు పోచ్చు. ఇందులో నటి సులోచన కథానాయకిగా నటించారు. ముఖ్య పాత్రలో నంబియాన్ నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం ఇప్పుడు నటుడు శశికుమార్ కథానాయకుడిగా రీమేక్ కానుంది. ఈ విషయాన్ని నట దర్శకుడు కే.భాగ్యరాజ్ ధ్రువీకరించారు. నటుడు శశికుమార్ కూడా ఈ ప్రచారాన్ని ధ్రువపరిచారు. దీని గురించి ఆయన తెలుపుతూ కే.భాగ్యరాజ్ నటించిన తూరల్ నిండ్రు పోచ్చు చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు తెలిపారు. ఆ చిత్ర కథను నేటి తరానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి పునర్నిర్మాణం జరపనున్నట్లు చెప్పారు.ఇందులో కే.భాగ్యరాజ్ పాత్రను తాను, నంబీయార్ పాత్రలో రాజ్‌కిరణ్ నటిస్తే బాగుంటుందని భావిస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం శశికుమార్ సముద్రఖని దర్శకత్వంలో నాడోడిగళ్ 2లో నటిస్తున్నారు. మరో చిత్రం అసురవధం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. -
రైటర్ రజనీ!
గాల్లోకి సిగరెట్ ఎగరేసి అలవోకగా నోటితో రజనీకాంత్ క్యాచ్ చేయడం చూశాం. నేను.. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అని రజనీ డైలాగ్స్ చెప్పడమూ చూశాం. స్టైలు స్టైలు రా.. ఇది సూపర్స్టైలు రా అంటూ ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించిన రజనీ స్టైలిష్ డ్యాన్స్ చూశాం. కానీ ఆయనలో ఎవరికీ తెలియని ఇంకో స్టైల్ ఉంది. అదే ఆయన రైటింగ్ స్టైల్. యస్.. రజనీ కథ రాశారని నటుడు–దర్శకుడు సముద్రఖని చెబుతున్నారు. ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన సినిమా ‘కాలా’. ఇందులో సముద్రఖని కీలక పాత్ర చేశారు. ‘కాలా’ షూటింగ్ అనుభవాలను ఆయన పంచుకున్నారు. ‘‘ఈ చిత్రం కోసం ఎక్కువగా నైట్ షూట్స్ చేశాం. రజనీసార్ ఫుల్ ఎనర్జీతో ఉండేవారు. ఫస్ట్ షాట్‌కు ఎలా ఉంటారో మార్నింగ్ 4 గంటల లాస్ట్ షాట్‌కు సేమ్ ఎనర్జీ. ఇది చూసి మేం అందరం షాక్ అయ్యాం. అంతేకాదు రజనీసార్ ఓ కథ రాశారు. ఆ కథ నాకు చెప్పారు. అందులో నన్నే నటించమన్నారు. ఆ సినిమాకి రైటర్‌గా రజనీసార్ పేరు ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు సుమద్రఖని. అయితే ఈ సినిమాను ఎప్పుడు తీయాలనుకుంటున్నారో మాత్రం సముద్రఖని చెప్పలేదు. -
గోలీసోడా–2లో సముద్రఖని
తమిళసినిమా: గోలీసోడా–2లో నటుడు, దర్శకుడు సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్య కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శక నిర్మాతగా వరుస విజయాలను అందుకుంటున్న సముద్రఖని తాజాగా నటిస్తున్న చిత్రం గోలీసోడా– 2. సాధారణంగా విజయం సాధించిన చిత్రాలన్నింటి కీ రెండవ భాగం రూపొందవు. అలా కొన్ని చిత్రాలకే అవకాశం ఉంటుంది. 2014లో చిన్న చిత్రంగా తెరకెక్కి పెద్ద విజయం సాధించిన చిత్రం గోలీసోడా. దానికి సృష్టికర్త ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్మి ల్టన్. ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టిన గోలీసోడా చిత్రం తాజాగా రెండవ భాగానికి దారి తీసింది. ఎస్. విజయ్‌మిల్టన్ తన రఫ్‌నోట్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో గోలీ సోడా–2ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయన ప్రకటించగానే చిత్ర పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందట. దీని గురించి దర్శక నిర్మాత విజయ్‌మిల్టన్ తెలుపుతూ ఇది ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. అందులో కీలకమైన పాత్రలో సముద్రఖని నటిస్తున్నారని చెప్పారు. గోలీసోడా చిత్రంలో ఏటీఎం పాత్ర ఎంత కీలకంగా ఉందో, అంత ప్రాముఖ్యం పార్టు–2లో సముద్రకని పాత్ర ఉంటుందన్నారు. ఇందులో ఆయన సస్పెండ్ అయిన కానిస్టేబుల్‌గా నటిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా గోలీసోడా–2లో పలు ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకుంటాయని విజయ్ మిలన్ అన్నారు. -
ఆ ఇద్దరితో ద్విభాషా చిత్రం?
తమిళసినిమా: శశికుమార్, తెలుగు నటుడు నానీలతో దర్శకుడు సముద్రఖని ద్విభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. నటుడు, దర్శకుడు అంటూ జోడు గుర్రాల స్వారీ చేస్తున్న సముద్రఖని ఇటీవల స్వీయ దర్శకత్వంలో నటించిన అప్పా, తొండన్ చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. మరో పక్క ఇతర చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్న సముద్రఖని దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఈయన తమిళంలో దర్శకత్వం వహించిన నాడోడిగళ్ చిత్రాన్ని తెలుగులో శంభో శివ శంభో పేరుతో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. అదే విధంగా జయంరవి ద్విపాత్రాభినయం చేసిన నిమిర్న్దు నిల్ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందించారు. తెలుగులో జెండాపై కపిరాజు పేరుతో తెరకెక్కిన ఇందులో నాని కథానాయకుడిగా నటించారు. అదేవిధంగా మరోసారి సముద్రఖని ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందులో తమిళవెర్షన్లో శశికుమార్, తెలుగులో నాని హీరోలుగా నటించనున్నట్లు సమాచారం. నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన నటించిన తెలుగు చిత్రం నిన్నుకోరి శుక్రవారం తెరపైకి రానుంది. నాని అక్కడ వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. సముద్రఖని దర్శకత్వంలో ఎప్పుడు నటిస్తారన్న విషయం గురించి క్లారిటి రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. శశికుమార్ ప్రస్తుతం కొడివీరన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.