పాటలే బ్యాలెన్స్‌ | Ravi Teja New Movie Crack Movie Releasing Shortly | Sakshi
Sakshi News home page

పాటలే బ్యాలెన్స్‌

Published Fri, May 15 2020 5:01 AM | Last Updated on Fri, May 15 2020 5:01 AM

Ravi Teja New Movie Crack Movie Releasing Shortly - Sakshi

క్రాక్‌

‘క్రాక్‌’ షూటింగ్‌ క్లైమాక్స్‌కు చేరుకుంది. ‘డాన్‌ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్‌’. ‘ఠాగూర్‌’ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమ్మిరాజు కానుమిల్లి ఈ సినిమాకు సహ నిర్మాత. ఇందులో సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ అంతా పూర్తయిందని చిత్రబృందం పేర్కొంది. అలాగే ఓ వారం రోజులు ప్యాచ్‌వర్క్‌ ఉంటుందట. షూటింగ్స్‌ చేయడానికి అనుమతి వచ్చిన వెంటనే ఈ రెండు పాటలను పూర్తి చేసి, వెంటనే రిలీజ్‌ కార్యక్రమాలు మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉంది ‘క్రాక్‌’ చిత్రబృందం. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement