సముద్రఖని
తమిళ సూపర్ హిట్ చిత్రం ‘కావల్’ను తెలుగులో ‘ఇంటిలిజెంట్ పోలీస్’ పేరుతో గ్రేహక్ మీడియా పతాకంపై వీరబ్రహ్మాచారి అన్నభీజు సమర్పణలో రాజశేఖర్ అన్నభీజు విడుదల చేయనున్నారు. జె.వి రామారావు ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్. సముద్రఖని, విమలా గీత, ఎమ్మెస్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. నాగేంద్రన్ ఆర్. దర్శకుడు. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొని సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది.
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ రామారావు మాట్లాడూతూ– ‘‘తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా పూర్తి ఆసక్తికరంగా ఈ సినిమా ఉంటుంది. నటీనటులందరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్‌కు విశేష స్పందన లభిస్తోంది’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాశ్.
Comments
Please login to add a commentAdd a comment