రైటర్‌ రజనీ! | The writer in Rajinikanth | Sakshi
Sakshi News home page

రైటర్‌ రజనీ!

Published Sat, Feb 3 2018 1:22 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

The writer in Rajinikanth - Sakshi

రజనీకాంత్‌

గాల్లోకి సిగరెట్‌ ఎగరేసి అలవోకగా నోటితో రజనీకాంత్‌ క్యాచ్‌ చేయడం చూశాం. నేను.. ఒక్కసారి చెబితే వందసార్లు  చెప్పినట్లే అని రజనీ డైలాగ్స్‌ చెప్పడమూ చూశాం. స్టైలు స్టైలు రా.. ఇది సూపర్‌స్టైలు రా అంటూ ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించిన రజనీ స్టైలిష్‌ డ్యాన్స్‌ చూశాం. కానీ ఆయనలో ఎవరికీ  తెలియని ఇంకో స్టైల్‌ ఉంది. అదే ఆయన రైటింగ్‌ స్టైల్‌. యస్‌.. రజనీ కథ రాశారని నటుడు–దర్శకుడు సముద్రఖని చెబుతున్నారు. ‘కబాలి’ ఫేమ్‌ పా. రంజిత్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందిన సినిమా ‘కాలా’. ఇందులో సముద్రఖని కీలక పాత్ర చేశారు.

‘కాలా’ షూటింగ్‌ అనుభవాలను ఆయన పంచుకున్నారు. ‘‘ఈ చిత్రం కోసం ఎక్కువగా నైట్‌ షూట్స్‌ చేశాం. రజనీసార్‌ ఫుల్‌ ఎనర్జీతో ఉండేవారు. ఫస్ట్‌ షాట్‌కు ఎలా ఉంటారో మార్నింగ్‌ 4 గంటల లాస్ట్‌ షాట్‌కు సేమ్‌ ఎనర్జీ. ఇది చూసి మేం అందరం షాక్‌ అయ్యాం. అంతేకాదు రజనీసార్‌ ఓ కథ రాశారు. ఆ కథ నాకు చెప్పారు. అందులో నన్నే నటించమన్నారు. ఆ సినిమాకి రైటర్‌గా రజనీసార్‌ పేరు ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు సుమద్రఖని. అయితే ఈ సినిమాను ఎప్పుడు తీయాలనుకుంటున్నారో మాత్రం సముద్రఖని చెప్పలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement