రజనీకాంత్
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎదురుచూస్తున్న కాలా చిత్రం టీజర్ గురువారం అర్ధరాత్రి విడుదలై కేక పుట్టిస్తోంది. కబాలి తరువాత రజనీ నటించిన చిత్రం కాలా. ఆయన అల్లుడు, నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడు. సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటి ఈశ్వరిరావు రజనీకాంత్‌కు భార్యాగా నటించారు. హిందీ నటుడు నానాపటేకర్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 27న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చిత్ర టీజర్‌ను మార్చి ఒకటవ తేదీన విడుదల చేయనున్నట్లు నటుడు ధనుష్ ముందుగా ప్రకటించడంతో రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే కంచి కామకోటి పిఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి శివైక్యం కావడంతో కాలా టీజర్ విడుదలను ఒక్క రోజు వాయిదా వేశారు. గురువారం అర్ధరాత్రి విడుదలైన టీజర్ కేక పుట్టిస్తోంది.
రజనీ పంచ్ డైలాగులు దుమ్మురేపుతూ చిత్ర రెంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఒక్కడినే నిలబడ్డా దిల్లుంటే మొత్తంగా రండి అని తిరునెల్వేలి తమిళ యాసలో రజనీ చెప్పే డైలాగులు తూటాల్లా పేలుతున్నాయి. నా రౌడీయిజాన్ని మొత్తం చూడలేదు. చూస్తారా? అంటూ తనదైన స్టైల్‌లో రజనీకాంత్ చెప్పే డైలాగులకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మొత్తం 78సెకన్ల నిడివి కలిగిన కాలా టీజర్ అభిమానుల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ కిరాక్ పుట్టిస్తోంది. టీజర్ విడుదలైన కొద్ది గంట ల్లోనే కబాలి చిత్ర టీజర్‌ను బీట్ చేసేందంటున్నారు సినీ వర్గాలు. అయితే ఈ టీజర్‌పై కొన్ని విమర్శలు తెలెత్తడం గమనార్హం. కాలా చిత్రంలో రజనీ అణగారిన జనం కోసం పోరాడే పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కబాలి చాయలు కనిపిస్తున్నాయని,వరుసగా రజనీకాంత్‌ను రౌడీగా చూడడం మోనాటనీగా భావించే అవకాశం ఉందనే విమర్శలు మొదలయ్యాయి. అదేవిధంగా రాజ్యాంగ కర్త అంబేడ్కర్‌ను కించపరచే విధంగా సంభాషణలు చోటుచేసుకున్నాయనే వివాదం తెరపైకి వస్తోంది. ఇది ఎటు వైపు దారి తీస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment