ఐదు కథలతో సినిమా | Four Rajinikanth stereotypes busted by Pa Ranjith | Sakshi
Sakshi News home page

ఐదు కథలతో సినిమా

Published Tue, Jul 31 2018 2:33 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Four Rajinikanth stereotypes busted by Pa Ranjith - Sakshi

పా. రంజిత్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం ఓ అప్‌కమింగ్‌ డైరెక్టర్‌కి దక్కడం అంటే చిన్న విషయం కాదు. ఆ అరుదైన చాన్స్‌ దక్కించుకుని, రజనీతో వెంట వెంటనే ‘కబాలి, ‘కాలా’ చిత్రాలు తీసిన రికార్డ్‌ని దర్శకుడు పా. రంజిత్‌ సాధించారు. నెక్ట్స్‌ రంజిత్‌ నుంచి ఎలాంటి సినిమా రానుందంటే.. ఐదు కథలతో ఆయన ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

సొంత బేనర్‌ నీలమ్‌ ప్రొడక్షన్స్‌పై రంజిత్‌ తీయనున్న ఈ చిత్రంలోని ఐదు కథల్లో నాలుగు కథలను వేరు వేరు దర్శకులు తెరకెక్కిస్తారు. ఓ కథను రంజిత్‌ తెరకెక్కిస్తారు. దీనికి ‘కుదిరై వాల్‌’ అనే టైటిల్‌ని అనుకున్నారట. అంటే.. గుర్రం తోక అని అర్థం. ఇది కాకుండా ఓ స్టార్‌ హీరో కోసం రెడీ చేసిన ఓ కథతో సినిమా తెరకెక్కించడానికి రంజిత్‌ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement