సముద్రఖని
‘ఆర్‘ఆర్‌ఆర్’ చిత్రానికి ప్యాన్ ఇండియా లుక్ తీసుకొచ్చే ప్లాన్‌లో కనిపిస్తున్నారు రాజమౌళి. అందులో భాగంగానే ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కో యాక్టర్‌ను ప్రాజెక్ట్‌లో భాగం చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (వర్కింగ్ టైటిల్). రాజమౌళి దర్శకుడు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ముఖ్యపాత్రలో కనిపిస్తారన్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం గురించి సముద్రఖని మాట్లాడుతూ – ‘‘నా తమిళ చిత్రం ‘నాడోడిగళ్’ చూసిన తర్వాత నన్ను ప్రశంసిస్తూ రాజమౌళిగారు నాకో పెద్ద మెసేజ్ పంపారు. అప్పటి నుంచి మేం టచ్‌లోనే ఉన్నాం. ఇటీవల రాజమౌళిగారు నన్ను వాళ్లింటికి ఆహ్వానించి వాళ్ల కుటుంబ సభ్యులందరికీ పరిచయం చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంది.. చేస్తారా అని అడిగారు. వెంటనే అంగీకరించాను’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రాను తీసుకున్నట్లు సమాచారం. 2020లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment