పాత బస్తీలో డిష్యుం డిష్యుం | Ravi Tejas Kracck shooting at old city | Sakshi
Sakshi News home page

పాత బస్తీలో డిష్యుం డిష్యుం

Published Tue, Dec 17 2019 12:09 AM | Last Updated on Tue, Dec 17 2019 12:09 AM

Ravi Tejas Kracck shooting at old city - Sakshi

రవితేజ

పాతబస్తీలో రౌడీమూకలను ర ఫ్ఫాడిస్తున్నారు ఆఫీసర్‌ రవితేజ. మరి ఆ రౌడీలు తప్పు తెలుసుకున్నారా? అనే విషయం తెలుసుకోవడానికి ఇంకా సమయం ఉంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. ‘డాన్‌ శీను, బలుపు’ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. శ్రుతీహాసన్‌ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని కీలకపాత్రలు చేస్తున్నారు. ‘ఠాగూర్‌’ మధు నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓల్డ్‌ సిటీలో ఓ పెద్ద ఫైట్‌ని చిత్రీకరించారు. నైట్‌ ఎఫెక్ట్‌లో సాగే ఈ ఫైట్‌ను రామ్‌–లక్ష్మణ్‌ మాస్టర్స్‌ చక్కగా డిజైన్‌ చేశారట. ఈ సినిమా షూటింగ్‌ సుమారు 25 శాతం పూర్తయిందని తెలిసింది. వేసవికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement