
ముంబై: ఫైనాన్స్, ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో దేశీ సూచీలు గురువారం ఇంట్రాడే, ముగింపుల్లోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. రిలయన్స్, టాటా మోటార్స్, ఐటీసీ వంటి అధిక వెయిటేజీ షేర్లూ రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 500 పాయింట్లు ఎగసి 82,283 వద్ద కొత్త రికార్డు నమోదు చేసింది.
చివరికి 349 పాయింట్ల లాభంతో 82,135 రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ఈ సూచీకిది ఎనిమిదో రోజు లాభాల ముగింపు. వరుసగా 11వ రోజూ లాభాలు కొనసాగించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 25,152 వద్ద స్థిరపడింది. ఒక దశలో 141 పాయింట్లు బలపడి 25,193 వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.51% పెరిగి రూ.3,041 వద్ద స్థిరపడింది. ఏజీఎంలో ముకేశ్ అంబానీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించడంతో ఇంట్రాడేలో 2.63 శాతం ర్యాలీ చేసి రూ.3,075 వద్ద గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,390 కోట్లు పెరిగి రూ.20.57 లక్షల కోట్లకు చేరింది.
తన అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సరీ్వసెస్‌లో ‘డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్’కు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించడంతో పేటీఎం షేరు 3% పెరిగి రూ.554 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment