రికార్డులు బద్దలు కొట్టాల్సిందే: మోదీ | Prime Minister Narendra Modi Interacts With BJP Workers | Sakshi
Sakshi News home page

రికార్డులు బద్దలు కొట్టాల్సిందే: మోదీ

Published Thu, Apr 4 2024 6:09 AM | Last Updated on Thu, Apr 4 2024 6:09 AM

Prime Minister Narendra Modi Interacts With BJP Workers  - Sakshi

లక్నో: దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల ఉత్సాహాన్ని, ఆత్మస్థైర్యాన్ని చూసి ప్రతిపక్షాలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాలని, పాత రికార్డులన్నింటినీ బద్ధలు కొట్టేలా కష్టపడి పని చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొత్త రికార్డులు సృష్టించడమే మన లక్ష్యం కావాలన్నారు.

బుధవారం ఉత్తరప్రదేశ్‌లో 10 లోక్‌సభ స్థానాల పరిధిలోని 22,648 పోలింగ్‌ బూత్‌లకు చెందిన బీజేపీ శ్రేణుల డిజిటల్‌ ర్యాలీని ఉద్దేశించి ‘నమో’ యాప్‌ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎన్నికల్లో విజయం పోలింగ్‌బూత్‌ స్థాయిలో సాధించే విజయంపై ఆధారపడి ఉంటుందన్నారు. పోలింగ్‌ బూత్‌లో నెగ్గకపోతే ఎన్నికల్లో నెగ్గలేమని స్పష్టం చేశారు. రాబోయే సార్వత్రి ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌ స్థాయిల్లో రికార్డులను బద్ధలు కొట్టేలా పని చేయడం అని కార్యకర్తలకు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement