
గణేషుడి లడ్డూలకు భలే డిమాండ్
శామీర్‌పేట్: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద శనివారం రాత్రి లడ్డూ వేలం నిర్వహించారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు పవన్‌గౌడ్ రూ.42,000 స్వామివారి లడ్డూను కైవసం చేసుకున్నారు. శామీర్‌పేట్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి చేతిలోని లడ్డూను జేఎల్‌ఎం ప్రశాంత్‌రెడ్డి రూ.20,100 వేలంలో దక్కించుకున్నాడు.