హైదరాబాద్, సాక్షి: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. వేలమంది భక్తుల ‘గణపతి బప్పా మోరియా’ నినాదాల నడుమ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు గణపతినాథుడు. అనుకున్న టైం కంటే ముందే శోభాయాత్ర మొదలుకాగా.. అంతే త్వరగతిన ట్యాంక్‌బండ్‌కి విగ్రహాన్ని చేర్చేందుకు పోలీసులు యత్నించారు. అయితే మధ్యలో అరగంటపాటు శోభా యాత్ర నిలిచిపోయింది. తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నిమజ్జనంలో పాల్గొని అరుదైన ఫీట్ సాధించారు.
స్పెషల్ క్రేన్‌తో
70 అడుగుల ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం కోసం సూపర్ క్రేన్‌ను శంషాబాద్ నుంచి తెప్పించారు. దాదాపు 350 టన్నుల బరువుల్ని మోయగలిగే ఆ క్రేన్ సాయంతోనే నిమజ్జనాన్ని ఎలాంటి అవాంతరం లేకుండా పూర్తి చేశారు.
జనసంద్రంగా ఎన్టీఆర్ మార్గ్
అనుకున్న టైం కంటే అరగంట ముందే ఖైరతాబాద్ గణేషుడు కదిలాడు. రెండంచెల రోప్ వ్యవస్థతో త్వరగతిన తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. మహా గణపతి నిమజ్జన నేపథ్యంలో.. ఎన్టీఆర్ మార్గ్‌లో మిగతా విగ్రహాలను ఆపేశారు. అందుకు భక్త జనం కూడా సపోర్ట్ చేశారు. ఒకానొక టైంలో త్వరగానే నిమజ్జనం పూర్తవుతుంది భావించారంతా. అయితే సచివాలయం వద్ద అరగంట సేపు విగ్రహాం ఆగిపోయింది. దీంతో అనుకున్న టైంకే విగ్రహ నిమజ్జనం పూర్తైంది. ఇంకోవైపు వాతావరణం చల్లబడడంతో జనం ఒక్కసారిగా ఎక్కువగా వచ్చారు.
స్వల్ప లాఠీ ఛార్జ్
ఖైరతాబాద్ విగ్రహా నిమజ్జనం అనంతరం.. భారీగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న గణపయ్యలకు పోలీసులు అనుమతించారు. దీంతో ఒక్కసారిగా రద్దీ నెలకొంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు అక్కడి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కిన యువతకు పోలీసులు సూచించారు. అయినా వాళ్లు వినకపోవడంతో స్వల్ప లాఠీ ఛార్జి చేశారు.
సీఎం రేవంత్ పర్యవేక్షణ
మునుపెన్నడూ లేని విధంగా గణేష్ నిమజ్జనానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర మహా గణపతి నిమజ్జన ఏర్పాట్లతో పాటు మిగతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. క్రేన్ల డ్రైవర్లతో పాటు ఇతర సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, షిఫ్ట్‌లవారీగా పని చేయించుకోవాలని, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిమజ్జనం పూర్తయ్యే చూడాలని అధికారుల్ని ఆదేశించారు.
Khairtabad #badaganesh ji Shobayatra slowly moving towards telugu thalli flyover #ganeshnimmajjnam #ganeshimmersion2024#GanpatiBappaMorya pic.twitter.com/vSuVZHeorS
— Hyderabad City Police (@hydcitypolice) September 17, 2024
ఈసారి సరికొత్త రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ లంబోదరుడు
- ఈసారి కోటి రూ.10 లక్షల ఆదాయం
- హుండీ ద్వారా రూ.70 లక్షలు
- ప్రకటనలు, హోర్డింగ్‌లతో మరో రూ.40 లక్షలు
- తొలిసారిగా ఖైరతాబాద్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు
- గత పదిరోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు కమిటీ వెల్లడి
రికార్డు స్థాయిలో భక్తుల దర్శనం
- ఏటా పెరుగుతున్న భక్తుల తాకిడి
- సెప్టెంబర్ 6వ తేదీన మహాగణపతి ఆగమన వేడుక
- 11 రోజులపాటు నిర్విఘ్నంగా సాగిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు
- మహాగణపతిని దర్శించుకున్న లక్షల మంది భక్తులు, సందర్శకులు
70 అడుగుల మహా గణపతి
- భాగ్యనగరమే కాదు తెలుగు రాష్ట్రాల్లో.. దేశవ్యాప్తంగానూ ఖైరతాబాద్ గణేషుడికి గుర్తింపు
- ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి
- అందుకే ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహం
- శిల్పి చిన్న స్వామి రాజేందర్
- గణేషుడికి ఒకటిన్నర రోజుల్లో అలంకరణ.. 200 మంది కార్మికుల శ్రమ
- శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా కొలువుదీరిన విష్నేషుడు
- ఈ ఏడాది శ్రీ సప్త ముఖ మహాశక్తి గణపతి గా భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణపతి.
- కుడి వైపు శ్రీ నివాస కళ్యాణం ఎడమ వైపు పార్వతి కళ్యాణం..
- భారీ విగ్రహం కింద వైపు అయోధ్య బాలరాముడి విగ్రహం ఏర్పాటు..
- పర్యావరణ హితంగా ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం ఏర్పాటు..
- ఈఏడాది కొలువు తీరిన ఖైరతాబాద్ గణేష్ బరువు సుమారు 40 నుంచి 50 టన్నులు
- పెద్ద ఎత్తున ఐరన్, పిచూ.. మట్టి వినియోగం..
Comments
Please login to add a commentAdd a comment