Khairatabad ganesh nimajjanam
-
Watch: గంగమ్మ ఒడికి మహా గణపయ్య
హైదరాబాద్, సాక్షి: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. వేలమంది భక్తుల ‘గణపతి బప్పా మోరియా’ నినాదాల నడుమ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు గణపతినాథుడు. అనుకున్న టైం కంటే ముందే శోభాయాత్ర మొదలుకాగా.. అంతే త్వరగతిన ట్యాంక్‌బండ్‌కి విగ్రహాన్ని చేర్చేందుకు పోలీసులు యత్నించారు. అయితే మధ్యలో అరగంటపాటు శోభా యాత్ర నిలిచిపోయింది. తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నిమజ్జనంలో పాల్గొని అరుదైన ఫీట్ సాధించారు.స్పెషల్ క్రేన్‌తో70 అడుగుల ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం కోసం సూపర్ క్రేన్‌ను శంషాబాద్ నుంచి తెప్పించారు. దాదాపు 350 టన్నుల బరువుల్ని మోయగలిగే ఆ క్రేన్ సాయంతోనే నిమజ్జనాన్ని ఎలాంటి అవాంతరం లేకుండా పూర్తి చేశారు.జనసంద్రంగా ఎన్టీఆర్ మార్గ్అనుకున్న టైం కంటే అరగంట ముందే ఖైరతాబాద్ గణేషుడు కదిలాడు. రెండంచెల రోప్ వ్యవస్థతో త్వరగతిన తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. మహా గణపతి నిమజ్జన నేపథ్యంలో.. ఎన్టీఆర్ మార్గ్‌లో మిగతా విగ్రహాలను ఆపేశారు. అందుకు భక్త జనం కూడా సపోర్ట్ చేశారు. ఒకానొక టైంలో త్వరగానే నిమజ్జనం పూర్తవుతుంది భావించారంతా. అయితే సచివాలయం వద్ద అరగంట సేపు విగ్రహాం ఆగిపోయింది. దీంతో అనుకున్న టైంకే విగ్రహ నిమజ్జనం పూర్తైంది. ఇంకోవైపు వాతావరణం చల్లబడడంతో జనం ఒక్కసారిగా ఎక్కువగా వచ్చారు.స్వల్ప లాఠీ ఛార్జ్ఖైరతాబాద్ విగ్రహా నిమజ్జనం అనంతరం.. భారీగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న గణపయ్యలకు పోలీసులు అనుమతించారు. దీంతో ఒక్కసారిగా రద్దీ నెలకొంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు అక్కడి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కిన యువతకు పోలీసులు సూచించారు. అయినా వాళ్లు వినకపోవడంతో స్వల్ప లాఠీ ఛార్జి చేశారు.సీఎం రేవంత్ పర్యవేక్షణమునుపెన్నడూ లేని విధంగా గణేష్ నిమజ్జనానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర మహా గణపతి నిమజ్జన ఏర్పాట్లతో పాటు మిగతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. క్రేన్ల డ్రైవర్లతో పాటు ఇతర సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, షిఫ్ట్‌లవారీగా పని చేయించుకోవాలని, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిమజ్జనం పూర్తయ్యే చూడాలని అధికారుల్ని ఆదేశించారు. Khairtabad #badaganesh ji Shobayatra slowly moving towards telugu thalli flyover #ganeshnimmajjnam #ganeshimmersion2024#GanpatiBappaMorya pic.twitter.com/vSuVZHeorS— Hyderabad City Police (@hydcitypolice) September 17, 2024 ఈసారి సరికొత్త రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ లంబోదరుడుఈసారి కోటి రూ.10 లక్షల ఆదాయంహుండీ ద్వారా రూ.70 లక్షలుప్రకటనలు, హోర్డింగ్‌లతో మరో రూ.40 లక్షలు తొలిసారిగా ఖైరతాబాద్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు గత పదిరోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు కమిటీ వెల్లడిరికార్డు స్థాయిలో భక్తుల దర్శనంఏటా పెరుగుతున్న భక్తుల తాకిడిసెప్టెంబర్ 6వ తేదీన మహాగణపతి ఆగమన వేడుక11 రోజులపాటు నిర్విఘ్నంగా సాగిన గణేష్ నవరాత్రి ఉత్సవాలుమహాగణపతిని దర్శించుకున్న లక్షల మంది భక్తులు, సందర్శకులు 70 అడుగుల మహా గణపతిభాగ్యనగరమే కాదు తెలుగు రాష్ట్రాల్లో.. దేశవ్యాప్తంగానూ ఖైరతాబాద్ గణేషుడికి గుర్తింపుఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తిఅందుకే ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహంశిల్పి చిన్న స్వామి రాజేందర్ గణేషుడికి ఒకటిన్నర రోజుల్లో అలంకరణ.. 200 మంది కార్మికుల శ్రమశ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా కొలువుదీరిన విష్నేషుడుఈ ఏడాది శ్రీ సప్త ముఖ మహాశక్తి గణపతి గా భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణపతి.కుడి వైపు శ్రీ నివాస కళ్యాణం ఎడమ వైపు పార్వతి కళ్యాణం..భారీ విగ్రహం కింద వైపు అయోధ్య బాలరాముడి విగ్రహం ఏర్పాటు..పర్యావరణ హితంగా ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం ఏర్పాటు..ఈఏడాది కొలువు తీరిన ఖైరతాబాద్ గణేష్ బరువు సుమారు 40 నుంచి 50 టన్నులుపెద్ద ఎత్తున ఐరన్, పిచూ.. మట్టి వినియోగం.. -
Khairatabad Ganesh 2023 Photos: ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)
-
Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ మహా గణపతి వద్ద భక్తజన సందోహం (ఫోటోలు)
-
కోలాహలంగా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం
-
మహాగణపతి నిమజ్జనం 11.30 లోపే..
ఖైరతాబాద్: ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ రామ్మోహన్‌లు వెల్లడించారు. ఈ సంవత్సరం నిమజ్జనం సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని సాగర్‌లో పూర్తిగా నిమజ్జనం అయ్యే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. అలాగే ఉదయం 11.30 కల్లా మహాగణపతి నిమజ్జన ఘట్టం పూర్తవుతుందన్నారు. సోమవారం వీరు ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్ ముషారఫ్ ఫారుకీ, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి ఖైరతాబాద్ మహాగణపతి పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ 65 సంవత్సరాల చరిత్ర ఉన్న ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్అండ్బి, వాటర్‌వర్క్స్, ఇంజనీరింగ్, హెల్త్, జీహెచ్ఎంసీ, విద్యుత్ తదితర శాఖల సాయంతో ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. సెన్సేషన్ థియేటర్, ఖైరతాబాద్ రైల్వేగేటు, మింట్ కాంపౌండ్ రోడ్లను వినాయక చవితి లోపు ఆధునీకరించాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని వైపులా ఎల్ఈడీ విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ వినతి మేరకు ఉత్సవాల 9 రోజులు మహాగణపతి ప్రాంగంలో కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటుచేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌కు, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. పూర్తిగా నిమజ్జనం చేస్తాం.... ప్రతీ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయిన నాలుగైదు రోజుల తర్వాత కూడా నీటిలో సగం తేలుతూ కనిపిస్తుందని, ఈ సంవత్సరం అలా కాకుండా ప్రత్యేకంగా నిపుణుల పర్యవేక్షణలో మహాగణపతి పూర్తిగా నిమజ్జనం అయ్యేవిధంగా చూస్తామని తెలిపారు. ఇందుకు సాగర్‌లో నిమజ్జనం గావించే ప్రాంతాల్లో లోతైన ప్రాంతాన్ని గుర్తించామని మంత్రి వెల్లడించారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీజీపీ, సీపీ ఆధ్వర్యంలో ఏరియల్ సర్వే ఉంటుందని, విద్యుత్ సరఫరా విషయంలో అధికారులు అలర్ట్‌గా ఉంటారన్నారు. మహాగణపతి నిమజ్జనం 11.30 లోపే పూర్తి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు లక్షలాది మందికి ఆసక్తి ఉంటుందని..అందుకే ఈ సంవత్సరం కూడా నిమజ్జనాన్ని ఉదయం 11.30 లోపే పూర్తిచేస్తామని, ఇందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ అంగీకరించాయని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రత్యేకంగా డ్రోన్ టెక్నాలజీ సాయంతో మహాగణపతి నిమజ్జనం పూర్తిగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహాగణపతి ప్రాంగణంలోని రోడ్లన్నీ వైట్ టాపింగ్ రోడ్లుగా ఆధునీకరిస్తామని తెలిపారు. గత సంవత్సరం 33 వేల వినాయక విగ్రహాలు ఉంటే ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశముందన్నారు. ఈ సంవత్సరం నిమజ్జనంకోసం ఇప్పటికే 33 చెరువుల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, 29 వినాయక పాండ్స్ కూడా పూర్తిచేసినట్లు మేయర్ తెలిపారు. పర్యవేక్షక పర్యటనలో సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, డి.ఐ నర్సింలు, జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ డీఎంసీ గీతారాధిక, ఎఎంఓహెచ్ భార్గవర్ నారాయణ, జీహెచ్ఎంసీ ఎఈ శరత్‌బాబు, ఈఈ నర్సింగ్‌రావు, డీఈ విజయకుమార్, ఖైరతాబాద్ ఎమ్మార్వో కృష్ణకుమార్, విద్యుత్ ఎఈ నర్సింహ్మస్వామి, డీఈ వెకంటయ్య, ఏడీఈ రమేష్, ఏఈ గంగారాం, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సింగరి సుదర్శన్, భాగ్యనగర్ గణేష్ ఉత్సివ కమిటీ నాయకులు భగవంతరావు, స్థానిక నాయకులు మహేందర్‌బాబు, చందు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
'అర్థరాత్రిలోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం'
హైదరాబాద్: వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ అనురాగ శర్మ పేర్కొన్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అనుకున్న టైంలోనే పూర్తి చేశామని చెప్పారు. బాలాపూర్ గణేష్ శోభయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అర్థరాత్రి లోపు బాలాపూర్ గణనాథుడిని నిమజ్జనం చేస్తామని డీజీపీ వెల్లడించారు. కాగా, వినాయక నిమజ్జనాలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ఏరియల్ సర్వేలో నాయిని వెంట డీజీపీ అనురాగ్‌శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన శోభాయాత్ర వైభవంగా జరిగింది. 6 గంటల్లో ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం రికార్డు సమయంలో పూర్తి అయింది. బాలాపూర్ గణేష్ శోభాయత్ర ఇంకా కొనసాగుతోంది. చార్మినర్ మీదుగా బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర ఎమ్జే మార్కెట్ వైపుగా కొనసాగుతోంది. అయితే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రూ. 14.65 లక్షలు పలికింది. గతంలో కంటే రూ. 4.33 లక్షలు ఎక్కువ పలికింది. వేలం పాటలో బడంగ్‌పేట గణేష్ లడ్డూ రూ. 5.21 లక్షలు పలికింది. -
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం
-
నిమజ్జనోత్సాహం, మహాగణపతి నిమజ్జనం