![Central Should Celebrate Medaram Jatara As National Festival - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/6/talasani-srinivas-yadav_0.jpg.webp?itok=9ayhY8Va)
సాక్షి, వరంగల్ : మేడారం జాతరను కేంద్రం జాతీయ పండుగగా గుర్తించాలని సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించినా.. నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు. జాతరకు సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వలేదంటూ బీజేపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కేంద్రం సహకారం లేకపోయినా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం జాతరను వైభవంగా నిర్వహిస్తోందన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా సీఎం కేసీఆర్ ఏ పండుగ, జాతర జరిగినా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మేడారంను పర్యాటక కేంద్రంగా, ఈ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment