‘కొడిపాయే లచ్చమ్మది’ అంటోన్న హెబ్బా పటేల్.. ! | Dinesh Tej and Hebah Patel's 'Ala Ninnu Cheri' Movie Lyrical Song Out | Sakshi
Sakshi News home page

Ala Ninnu Cheri: 'మందేస్తే మా ఊరు యాదికొస్తది.. మా పాట యాదికొస్తది'

Published Thu, Sep 28 2023 5:51 PM | Last Updated on Thu, Sep 28 2023 6:12 PM

Dinesh Tej  and Hebah Patel Ala Ninnu Cheri Movie Lyrical Song - Sakshi

యంగ్ హీరో దినేష్ తేజ్, హీరోయిన్ హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'అలా నిన్ను చేరి'. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి  కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'కొడిపాయే లచ్చమ్మది' అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరై లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను మంగ్లీ పాడగా.. కుర్రకారుని కట్టిపడేసేలా మరో జానపదంగా నిలవబోతోంది.

(ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్‌'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?)

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్‌ మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య రిలీజ్ చేసిన అలా నిన్ను చేరి టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండింగ్‌లో నిలిచిన తెలిసిందే.

 తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘యంగ్ టీం అంతా కలిసి ఈ సినిమాను నిర్మించారు. యంగ్ టాలెంట్‌ను ప్రేక్షకులు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. కొత్త సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారు. యంగ్ టాలెంట్ టీం తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ మూవీపెద్ద విజయం సాధించాలి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement