
తలసాని శ్రీనివాస యాదవ్(పాత చిత్రం)
వరంగల్ అర్బన్: దద్దమ్మ కాంగ్రెస్ నేతలు బస్సు యాత్ర పేరుతో కారుకూతలు కూస్తున్నారని తెలంగాణ పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరూ సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సూట్‌కేసు దొంగలు కూడా మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ తన మాటలతో ఓ బచ్చా అని అర్ధమైందని అన్నారు. హైదరాబాద్ పర్యటనలో, పార్లమెంటులో తన మాటలు, చేష్టలు దేశం మొత్తం చూసిందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో బీజేపీ ఐదు స్థానాలు గెలిస్తే ఎక్కువని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 2న జరిగే సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవ్వాలని కోరారు. రాష్ర్టంలో సంక్షేమ పథకాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, అవి అందరికీ అందుతున్నాయని, ఆ కృతజ్ఞతతో సభకు హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లిగాడు, పుల్లయ్య అందరూ జెండాలు, ఎజెండాలు పక్కకు పెట్టి తిరుగుతున్నారని, రాష్ట్రంలో ఓ ముఠాగా మారి లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలే మా ప్రధాన బలమని చెప్పారు. గతంలో ప్రభుత్వాలు కుల వృత్తులను నిర్వీర్యం చేస్తే మేము కుల వృత్తుల పునరుద్ధరణ కోసం అన్ని కులాలకు ఆర్ధిక చేయూతను ఇస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment