
భీమవరం: టీడీపీ అసత్య, ఆర్భాట ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం మినహా నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం ఆయన భీమవరం వచ్చారు. 400 ఏళ్ల కింద నిర్మించిన హైదరాబాద్‌ను తానే నిర్మించానని గొప్పలు చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో అమరావతిలో రాజధానిని ఎం దుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు.
ఏపీకి ఆదాయం లేదని, రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జె ట్‌తో అప్పగించారని మొసలి కన్నీరు కారుస్తున్న చం ద్రబాబు పత్రికలు, టీవీల్లో ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఎలా దుబారా చేస్తున్నారని ప్రశ్నిం చారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నవారిపై కేసులు పెడతామని బెదిరించిన చం ద్రబాబు.. ఇప్పుడు స్వార్థం కోసం ప్రత్యేక హోదా అంటున్నారని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడం చంద్రబాబుకు అలవాటేనని, దీన్ని ప్రజలు గ్రహిం చారని, ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. ఏపీలో వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకోవడమే కాకుండా వారిలో నలుగురికి మంత్రి పదవులెలా ఇచ్చారని ప్రశ్నిం చారు.
Comments
Please login to add a commentAdd a comment