ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: చట్ట సభల్లో బీసీలకు రిజ ర్వేషన్లు కల్పించేందుకు 2019లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వెల్లడిం చారు. పార్లమెంటులో బీసీ బిల్లును ఆమోదిం చేందుకు రాహుల్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరు లతో మాట్లాడారు. ఈ విషయంపై మంగళ వారం రాహుల్‌గాంధీతో ప్రత్యేకంగా చర్చించా మని అందుకు ఆయన తనకు స్పష్టమై న హామీ ఇచ్చారని తెలిపారు. రాహుల్‌ను కలసిన విషయంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ప్రధానంగా బీసీ బిల్లుపైనే ఇరువురం చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment