
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌లో బీసీ బిల్లు, రూ.20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టే వరకు పోరాటం ఆగదని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. శుక్రవారం జరిగిన బీసీ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ..200లకు పైగా డిమాండ్లతో బీసీ డిక్లరేషన్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించామని, ఇప్పటి వరకూ దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జనాభా ప్రకారం బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అర్హత కలిగిన ప్రతి బీసీకి రూ.రెండు లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 22న హైదరాబాద్‌లో జరగనున్న బీసీ విస్తృత స్థాయి సమావేశానికి అన్ని జిల్లాల ముఖ్య నేతలు, వివిధ కుల సంఘాల రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment