కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజావ్యతిరేక విధానాలపై ఎర్రదండు కన్నెర్ర జేసింది. చిత్తశుద్ధితో ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది. సీపీఐ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరే ట్ ఎదుట శుక్రవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. అంతకుముందు బద్దం ఎల్లారెడ్డి భవన్‌నుంచి ర్యాలీగా చేరుకున్నారు.
కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదు ట బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దాదాపు గంటసేపు ధర్నా అనంతరం కార్యకర్తలు ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కా ర్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తరలించే క్ర మంలో కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు.
జీపుకు అడ్డంగా పడుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీసు వ్యాన్‌లో బలవంతంగా ఎక్కించి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల అవినీతి, అసమర్థ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయూలని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి చర్యలు చేపట్టాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్.రామయ్య, కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, బోయిని అశోక్, నాయకులు అడ్డగుంట మల్లయ్య, పొనగంటి కేదారి, మాడిశెట్టి భాగ్యలక్ష్మి, కూన శోభారాణి, పోతిరెడ్డి వెంకటరెడ్డి, జాగీరు సత్యనారాయణ, వేల్పుల బాలమల్లు, కొయ్యడ సృజన్‌కుమార్, అందెస్వామి, పైడిపల్లి రాజు, బోనగిరి మహేందర్, పంజాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎర్రదండు కన్నెర్ర
Published Sat, Oct 5 2013 4:53 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement