అనంతపురం: అనంతపురం జల్లా కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఛాంబర్ లోని ఫైల్స్ కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని అగ్నిప్రమాదంపై విచారణ చేపట్టారు.