- డివిజన్లు, మండలాలపై 94
- ఆన్‌లైన్ ద్వారానే అధికం
జిల్లాల ఏర్పాటుపై 441 అభ్యంతరాలు
Published Wed, Aug 24 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. బుధవారం రాత్రి వరకు జిల్లాలపై 441 అభ్యంతరాలు రాగా.. డివిజన్లు, మండలాలపై 94 వచ్చాయి. ఈ అభ్యంతరాలు ఆన్‌లైన్ ద్వారా అధికంగా వస్తున్నాయి. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అప్పీళ్ల స్వీకరణ కేంద్రానికి బుధవారం నేరుగా 8 అప్పీళ్లు మాత్రమే అందాయి.
ఆచార్య జయశంకర్ జిల్లాపై 123, హన్మకొండ జిల్లాపై 246, మహబూబాబాద్‌పై 13, వరంగల్‌పై 59 అప్పీళ్లు ఇప్పటి వరకు వచ్చాయి. అభ్యంత రాల నమోదు కోసం www.newdistrictsformation.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్‌అవ్వాలి. అడిగిన వివరాలు అందజేయాలి. మీ అప్పీల్ ఫైల్ అయినట్లు మీ సెల్‌కు సమాచారం వస్తుంది.
Advertisement
Advertisement