online appeals
-
జిల్లాల ఏర్పాటుపై 1282 అప్పీళ్లు
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి గురువారం రాత్రి వరకు ఆన్లైన్ ద్వారా మొ త్తం 1282 అప్పీళ్లు అందాయి. వీటిలో కొత్తగా ఏర్పడబోయే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు, మండలాలకు సంబంధించిన అభ్యంతరాలు, సూచనలు ఉన్నాయి. కొత్తజిల్లాలకు సంబంధిం చి అప్పీళ్లను పౌరులు నేరుగా ఆన్లైన్ ద్వారా కూడా ఫైల్ చేయవచ్చు. ఈ విధానం సులభతరంగా ఉండేలా వెబ్సైట్లో సౌకర్యం కల్పించారు. ఇందు కోసం www.newdistricts formation.telangana.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయి వివరాలు అందజేయాలి. చేతిరాతతో రాసిన కాగి తం కానీ, డీటీపీ ద్వారా తయారు చేసి న డాక్యుమెంట్ స్కాన్ చేసి అభిప్రాయం వెబ్సైట్లో ఆటాచ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పీల్ ఫైల్ అయినట్లు దరఖాస్తుదారు సెల్‌కు సమాచారం వస్తుంది. -
జిల్లాల ఏర్పాటుపై 441 అభ్యంతరాలు
డివిజన్లు, మండలాలపై 94 ఆన్లైన్ ద్వారానే అధికం హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. బుధవారం రాత్రి వరకు జిల్లాలపై 441 అభ్యంతరాలు రాగా.. డివిజన్లు, మండలాలపై 94 వచ్చాయి. ఈ అభ్యంతరాలు ఆన్లైన్ ద్వారా అధికంగా వస్తున్నాయి. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అప్పీళ్ల స్వీకరణ కేంద్రానికి బుధవారం నేరుగా 8 అప్పీళ్లు మాత్రమే అందాయి. ఆచార్య జయశంకర్ జిల్లాపై 123, హన్మకొండ జిల్లాపై 246, మహబూబాబాద్‌పై 13, వరంగల్‌పై 59 అప్పీళ్లు ఇప్పటి వరకు వచ్చాయి. అభ్యంత రాల నమోదు కోసం www.newdistrictsformation.telangana.gov.in వెబ్సైట్లోకి లాగిన్అవ్వాలి. అడిగిన వివరాలు అందజేయాలి. మీ అప్పీల్ ఫైల్ అయినట్లు మీ సెల్‌కు సమాచారం వస్తుంది.